ETV Bharat / bharat

DeltaPlus: నెల రోజుల క్రితమే తొలి మరణం! - డెల్టాప్లస్​ వేరియంట్

మధ్యప్రదేశ్​లో డెల్టాప్లస్​ వేరియంట్​తో తొలి మరణం నమోదైనట్లు తేలింది. నెలరోజుల క్రితమే మృతి చెందిన ఓ మహిళకు ఈ వేరియంట్​ సోకినట్లు నిపుణులు గుర్తించారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం ఐదుగురికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు తేలింది.

Delta Plus variant
డెల్టాప్లస్​ వేరియంట్ తొలి మరణం
author img

By

Published : Jun 24, 2021, 12:54 PM IST

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి అదుపులోకి వస్తున్న సమయంలో 'డెల్టా ప్లస్‌' వేరియంట్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఈ రకం కేసులు వెలుగుచూస్తుండగా.. తాజాగా మధ్యప్రదేశ్‌లో నెల రోజుల క్రితం ఓ మహిళ మరణానికి 'డెల్టా ప్లస్‌' కారణంగా తేలింది. ఈ వేరియంట్‌లో ధ్రువీకరించిన తొలి మరణం ఇదే.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొవిడ్‌ సోకి మే 23న ప్రాణాలు కోల్పోయారు. ఆమె రక్తనమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా.. ఆమెకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిన ఐదు కేసులు బయటపడ్డాయి. భోపాల్‌లో మూడు, ఉజ్జయినిలో రెండు కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు వైరస్‌ నుంచి కోలుకోగా.. ఒకరు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రకం సోకిన వారిని గుర్తించి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టారు.

ఇప్పటివరకు దేశంలో 40కి పైగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ నిన్న వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 21 కేసులు బయటపడగా.. మధ్యప్రదేశ్‌, కేరళ, జమ్ముకశ్మీర్‌ తదితర రాష్ట్రాలకు ఈ వైరస్‌ పాకింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. డెల్టాప్లస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అడ్వయిజరీ జారీ చేసింది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళనకర రకంగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Vaccine: టీకా తర్వాత.. తొలి 30నిమిషాలే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.