స్వీట్నర్ పేరిట్ ఆన్లైన్లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్(ganja smuggling news) రాకెట్‌ను ఛేదించిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ అమ్మకాలకు వీలు కల్పించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్ ఇండియా'పై(ganja smuggling in india) శనివారం కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఎస్‌ఎల్ పేరిట ఈ-కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్‌పై (Amazon India officials) నార్కోటిక్స్ డ్రగ్స్ చట్టంలోని సెక్షన్ 38 కింద కేసు పెట్టినట్లు భింద్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ నెల 13న ఇద్దరు గ్వాలియర్ వాసుల నుంచి 21.7కిలోల గంజాయిని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం(ganja smuggling visakhapatnam) నుంచి వీరు సరకును అమెజాన్ ద్వారా తెప్పించినట్లు గుర్తించారు. కాగా.. నిషేధిత వస్తువుల అమ్మకాలకు అమెజాన్‌ను వేదికగా మారనీయబోమని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కూడా పేర్కొంది.
ఇదీ కేసు..
అమెజాన్ వేదికగా గంజాయి అక్రమ రవాణా అవుతున్నట్లు ఈ నెల 15న మధ్యప్రదేశ్ భింద్ జిల్లా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కరివేపాకు అని రాసి ఉన్న 20 కేజీల గంజాయి పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 'కల్లు' అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా.. గంజాయి రాకెట్ గుట్టు రట్టయింది. కల్లు రూ.1.1కోట్ల లావాదేవీలు జరిపినట్లు తెలిసిందని భిండ్ ఎస్పీ వెల్లడించారు. స్థానిక గోవింద్ దాబాలో ఉన్న అతడిని.. దాబా నిర్వాహకుడిని అరెస్టు చేశారు. గంజాయి పార్సిళ్లను రిసీవ్ చేసుకునేది 'కల్లు'నే పోలీసులు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోనూ ముకేశ్ జైశ్వాల్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు అమెజాన్ ద్వారా గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఇవీ చదవండి:
'విశాఖ నుంచి అమెజాన్ ద్వారా 1000కిలోల గంజాయి స్మగ్లింగ్'
ganja smuggling: మిస్టరీగానే మిగిలిపోతున్న మాదకద్రవ్యాల కేసులు... ఎందుకలా?