ETV Bharat / bharat

ఆ ఎంపీ బెదిరించారని స్పీకర్​కు నవనీత్​ రాణా ఫిర్యాదు - అర్వింద్​ సావంత్​

శివసేన ఎంపీ అర్వింద్​ సావంత్​ తనను బెదిరించారని ఆరోపిస్తూ.. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు అమరావతి ఎంపీ నవ్​నీత్​ రాణా. తనను జైల్లో పెట్టిస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ అంశంపై ఆమె పోలీస్​ స్టేషన్​నూ ఆశ్రయించారు. ఈ అంశంపై స్పందించిన సావంత్​.. రాణా ఆరోపణలను తోసిపుచ్చారు.

MP Navneet Ravi Rana
శివసేన ఎంపీ బెదిరించారని స్పీకర్​కు నవనీత్​ రాణా ఫిర్యాదు
author img

By

Published : Mar 23, 2021, 5:39 AM IST

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్​ రవి రాణా.. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటులో సచిన్​ వాజే అంశంపై మాట్లాడిన సందర్భంలో.. శివసేన ఎంపీ అర్వింద్​ సావంత్​ తనను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఆమె పోలీస్​ స్టేషన్​లోనూ ఆశ్రయించారు.

వాజే అంశం లేవనెత్తగానే.. 'నువ్​ మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా, జైల్లో పెట్టిస్తా.' అని సావంత్​ బెదిరించినట్లు రాణా తెలిపారు.

MP Navneet Ravi Rana
స్పీకర్​కు లేఖ రాసిన నవనీత్​ రాణా

గతంలోనూ శివసేన నుంచి తనకు యాసిడ్​ దాడి చేస్తామని బెదిరింపులు వచ్చాయని రాణా పేర్కొన్నారు.

''ఎంపీ అర్వింద్​ సావంత్​ నన్ను బెదిరించిన తీరు నా ఒక్క దానికే కాదు.. దేశంలోని మహిళందరికీ అవమానకరమే. అందుకే.. సావంత్​పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నా.''

- నవనీత్​ రవి రాణా, స్వతంత్ర ఎంపీ

ముంబయి మాజీ సీపీ పరమ్​బీర్​ సింగ్ ఆరోపణల నేపథ్యంలో.. హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ సహా మహారాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని భాజపా డిమాండ్​ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్​సభలో సోమవారం నవనీత్​ రాణా.. సచిన్​ వాజే అంశాన్ని లేవనెత్తారు.

నేనెందుకు బెదిరిస్తా?

అయితే.. రాణాను తానేమీ అనలేదని బదులిచ్చారు సావంత్​. అదో పెద్ద అబద్ధమని, తానలా చేయలేదని చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్​ సరైనది కాదని అన్నారు.

''ఇదో పెద్ద అబద్ధం. ఎందుకు నేను ఆమెను బెదిరిస్తా? ఒకవేళ ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే వారే చెప్పగలరు నేను బెదిరించానో లేదో అని''

- అర్వింద్​ సావంత్​, శివసేన ఎంపీ, దక్షిణ ముంబయి

ఇవీ చూడండి: పరమ్​Xదేశ్​ముఖ్​- 'మహా'లో లేఖ దుమారం

పరమ్​బీర్ లేఖపై పార్లమెంటులో రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.