ETV Bharat / bharat

చికెన్​ వండలేదని భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త! - చికెన్​ చేయనందని భార్యను హత్య చేసిన భర్త

చికెన్​ వండేందుకు నిరాకరించిందని.. ఓ వ్యక్తి భార్యను హత్య(man kills wife) చేశాడు. మధ్యప్రదేశ్​లోని షాదోల్​ జిల్లాలో ఆగస్టు 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

man kills wife for not cooking chicken
చికెన్​ వండనందని భార్యపై ఆగ్రహం.. హత్య!
author img

By

Published : Sep 1, 2021, 9:00 PM IST

Updated : Sep 1, 2021, 9:49 PM IST

చికెన్ వండేందుకు నిరాకరించిన భార్యను హత్య చేశాడు(man kills wife) ఓ వ్యక్తి. మధ్యప్రదేశ్​లోని షాదోల్​ జిల్లా సెమారియతోల గ్రామంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం..

ఆగస్టు 23న నిందితుడు కమలేశ్​ కోల్​.. భార్య రామ్​బాయ్​ కోల్​ను చికెన్​ వండమని అడిగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన నిందితుడు కమలేశ్.. అక్కడే ఉన్న కర్రతో భార్య తలపై బలంగా మోదాడు(man kills wife). దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

ప్రమాదానికి గురై రామ్​బాయ్​ కోల్​ మృతిచెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. కానీ పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం బయటపడే సరికి నిందితుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదివారం అరెస్టు చేశారు. చికెన్​ వండేందుకు నిరాకరించడం వల్లే భార్యపై దాడి చేసినట్లు నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడు.

ఇదీ చూడండి : తేలిన విభజన పంచాయతీ- రాష్ట్ర పక్షిపై కీలక ప్రకటన

Last Updated : Sep 1, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.