ETV Bharat / bharat

ఒక్కడే 75 మందిని పెళ్లాడి.. 200 మంది అమ్మాయిల్ని... - మధ్యప్రదేశ్​ వార్తలు తాజా

ఓ వ్యక్తి ఇప్పటివరకు 75 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతేకాదు.. గత ఐదేళ్లలో 200 మంది యువతులను బంగ్లాదేశ్​ నుంచి భారత్​లోకి అక్రమ రవాణా చేశాడు. సెక్స్​ రాకెట్​ కేసులో (Sex Racket News) భాగంగా మధ్యప్రదేశ్​ పోలీసులకు పట్టుబడ్డ మునిర్​ అనే నిందితుడిని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Madhya Pradesh
ఒక్కడే 75 మందిని పెళ్లి చేసుకుని.. 200 మంది అమ్మాయిల్ని..
author img

By

Published : Oct 5, 2021, 4:29 PM IST

ఇటీవల మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో ఓ సెక్స్​ రాకెట్​ గుట్టును (Sex Racket News) రట్టు చేశారు అక్కడి పోలీసులు. వ్యభిచార కూపం నుంచి 21 మంది యువతులను రక్షించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్​ చేయగా.. గుజరాత్​లోని సూరత్​లో పోలీసులకు గురువారం పట్టుబడ్డ ప్రధాన నిందితుడు మునిర్​.. విస్తుపోయే విషయాలను వెల్లడించాడు. తాను ఇప్పటివరకు 75 మందిని వివాహం చేసుకున్నానని.. 200 మంది యువతులను భారత్​లోకి (Human Trafficking in India) అక్రమ రవాణా చేశానని పేర్కొన్నాడు.

Madhya Pradesh
పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు

బంగ్లాదేశ్​ నుంచి మధ్యప్రదేశ్​కు..

బంగ్లాదేశ్​లోని జాసుర్​కు చెందిన మునిర్​ అలియాస్ మునిరుల్​.. ఉపాధి నెపంతో ఆ దేశానికి చెందిన యువతులను భారత్​లోకి అక్రమ రవాణా చేసేవాడు. ఇక్కడ వారిని వ్యభిచారంలోకి (Sex Racket News) దింపేవాడు. బంగాల్​లోని ముర్షిదాబాద్​ నుంచి మునిర్​ భారత్​లోకి (Human Trafficking in India) మహిళలను అక్రమ రవాణా చేసేవాడు. సరిహద్దులోని అధికారులకు రూ.25వేల చొప్పున లంచం ఇచ్చేవాడని పోలీసులు వెల్లడించారు.

ఈ క్రమంలో మునిర్​ గత ఐదేళ్లలో 200 మంది యువతులను భారత్​లోకి అక్రమ రవాణా చేశాడని.. ఇప్పటివరకు 75 మందిని వివాహం చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ముంబయి, కోల్​కతా ప్రధాన కేంద్రాలుగా బంగ్లాదేశ్​ నుంచి తీసుకువచ్చిన యువతులను వ్యభిచారంలోకి దింపేవాడని పేర్కొన్నారు. యువతులను దేశంలోని వివిధ పట్టణాలకు తరలించేవారని తెలిపారు.

ఇదీ చూడండి : సమీర్‌ వాంఖడే.. 'తెర'చాటు డ్రగ్స్‌పై ముంబయి 'సింగం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.