ETV Bharat / bharat

మటన్​ బ్యాగ్​ పట్టుకెళ్లిందని మూగజీవిపై కర్కశంగా.. - కుక్కపై దాడి

మాంసం తీసుకెళ్లిందని ఓ కుక్కను దారుణంగా కొట్టి చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో ఆదివారం జరిగింది.

attack on dog
మటన్​ పట్టుకెళ్లిందని కుక్కపై దాడి
author img

By

Published : Nov 23, 2021, 6:27 AM IST

మధ్యప్రదేశ్​ ఇందోర్​కు చెందిన ఓ వ్యక్తి మూగజీవిపై కర్కశంగా ప్రవర్తించాడు. తన ఇంటి నుంచి మాంసం పట్టికెళ్లిందన్న కారణంతో ఓ కుక్కను కర్రతో కొట్టి చంపాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది..

విజయ్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసించే జగదీశ్​ చౌహాన్​ అలియాస్​ ఠాకుర్​.. అదివారం మటన్ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంతలో ఓ వీధి కుక్క ఠాకుర్​ ఇంట్లోకి చొరబడి ఆ మాంసం ఉన్న సంచిని ఎత్తుకెళ్లింది. ఇది గమనించిన ఠాకుర్​ ఆ కుక్కను వెంబడించాడు. మాంసం ఎత్తుకెళ్లినందుకు ఆ మూగజీవిని కర్రతో కొట్టి చంపేశాడు.

ఇదీ చూడండి : మద్యం తాగమని రాష్ట్ర ప్రజలు ప్రమాణం చేయాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.