మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలోని వజ్రాల గనుల్లో 7.44, 14.98 క్యారెట్ల బరువున్న రెండు వజ్రాలు ఇద్దరు కార్మికులకు దొరికాయి. దీంతో ఆ ఇద్దరు ఒక్కరోజులో లక్షాధికారులు అయ్యారు.
జారువ్పుర్లో ఓ వజ్రాల గనిలో దిలీప్ మిస్త్రీకి 7.44 క్యారెట్ల వజ్రం దొరకగా.. అదే జిల్లాలోని కృష్ణ కల్యాణపుర్ ప్రాంతంలో లఖన్ యాదవ్కు 14.98 క్యారెట్ల వజ్రం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ రెండింటిని వజ్రాల కార్యాలయానికి అందజేయగా.. వాటిని వేలం వేయనున్నారు. వచ్చిన ఆదాయంలో 12.5 శాతం తగ్గించి మిగిలినది లబ్ధిదారులకు అందిస్తామని అధికారులు చెప్పారు.
చిన్నది రూ. 30లక్షలు..
7.44 క్యారెట్ల వజ్రం ధర రూ. 30 లక్షలు పలుకుగా... రెట్టింపు బరువున్న పెద్ద వజ్రం సుమారు రూ. 60 లక్షల విలువ చేస్తుందని అధికారులు అంచనా వేశారు.
వజ్రాలు దొరికినందుకు సంతోషం వ్యక్తం చేశారు కార్మికులు. వచ్చిన డబ్బును పిల్లల చదువుకు ఉపయోగిస్తానని యాదవ్ చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి: సీఎంకు చేదు అనుభవం.. ఉల్లితో ప్రజలు దాడి