మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు రావాల్సిన వేతనాన్ని అడిగినందుకు కూలీ చేయి నరికాడు(Madhya Pradesh crime news) ఓ యజమాని. సిర్మౌర్ పోలీసు స్టేషన్ పరిధిలోని డోల్మవూ గ్రామంలో జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది
రేవా జిల్లాలో దళిత వర్గానికి చెందిన అశోక్ సాకేత్ కొన్ని రోజుల క్రితం డోల్మవూ గ్రామానికి చెందిన గణేశ్ మిశ్రా వద్ద కూలీగా పని చేశాడు. అయితే సాకేత్‌కు రావాల్సిన వేతనాన్ని మిశ్రా చెల్లించలేదు. దీంతో బకాయి పడిన వేతనం ఇవ్వాలని సాకేత్ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన గణేశ్.. పదునైన ఆయుధంతో సాకేత్ చేయి(Rewa crime news) నరికేశాడు. అనంతరం ఘటనాస్థలికి సమీపంలో ఆ చేయిని దాచేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. నరికేసిన చేయిని వెతికి పట్టుకుని, సాకేత్‌ను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసి అతికించారు వైద్యులు. అయితే ఎక్కువ రక్తం పోవడం వల్ల బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేశ్ మిశ్రా, అతని సోదరులు రత్నేశ్ మిశ్రా, కృష్ణ కుమార్ మిశ్రాలను అరెస్ట్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్లు గణేశ్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:
మూడేళ్లుగా ఫేస్బుక్ ప్రేమ.. తనను కాదన్నాడని యాసిడ్ దాడి