ETV Bharat / bharat

భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్.. నగ్న వీడియోలు తీసి.. - కాన్పుర్ పోలీస్ స్టేషన్

తన భార్యపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. బలవంతంగా అసహజ శృంగారం చేశాడు. నగ్నంగా వీడియోలు తీసి రూ.కోటి ఇవ్వకపోతే సోషల్ మీడియాలో షేర్​ చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Husband harassed Wife in indore
అసహజ శృంగారం చేయాలని భార్యపై ఒత్తిడి
author img

By

Published : Jul 3, 2022, 10:18 AM IST

మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో దారుణం జరిగింది. అసహజ శృంగారం చేస్తూ తనను ఇబ్బంది పెట్టాడని భర్తపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. న్యూడ్​ వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని లసుడియా పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టింది. రూ.కోటి రూపాయలు ఇవ్వకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్​మెయిల్​కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు అత్తమామలు కూడా సహకరిస్తున్నారని వారిపై కూడా కేసు పెట్టింది. బాధితురాలి భర్త.. స్వస్థలం కాన్పుర్ కావడం వల్ల ఈ కేసును అక్కడికి బదిలీ చేశారు లసుడియా పోలీసులు.

అసలేం జరిగిందంటే:
2018 జూలై 10న బాధితురాలికి కాన్పుర్​కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కట్నంగా 40 తులాల బంగారం, కారు ఇచ్చారు. అనంతరం సరదాగా ఇరువురు హనీమూన్‌కు వెళ్లారు. అప్పుడు భర్త.. ఆమెను హోటల్​కు తీసుకెళ్లాడు. అక్కడ అసహజ శృంగారం చేయమని ప్రేరేపించాడు. అప్పుడే అతని అసలు బుద్ధి బాధితురాలికి అర్థమైంది. అయితే, అండగా ఉండాల్సిన అత్తామామలు కూడా ఆమెకు ప్రతికూలంగా మారారు. ఎవరికైనా ఈ విషయం చెబితే ఇబ్బందులు తప్పవంటూ మహిళను.. ఆమె మామ బెదిరించాడు. కోడలిని వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు ఇందోర్​లోని తన పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది. అనంతరం లసుడియా పోలీసులను ఆశ్రయించింది.

ఇవీ చదవండి: జుట్టు రాలుతుందని.. ప్రాణం తీసేసుకున్న యువతి!

నిద్రమాత్రలు ఇచ్చి.. భర్తను చికెన్​ బర్నర్​లో కాల్చిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.