మరణించిన ఓ ఉద్యోగిని బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చి మధ్యప్రదేశ్ ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ జాట్‌ను రాజ్‌గఢ్ మున్సిపల్ కౌన్సిల్‌కు బదిలీ చేస్తున్నట్టు ఆగస్టు 31న ఉత్తర్వులు జారీ చేసింది.
ఏం జరిగిందంటే..
రూ. 3వేల లంచం తీసుకున్నట్టు ఫిర్యాదు అందడం వల్ల బియోరాలో విధులు నిర్వహిస్తున్న సంజయ్ జాట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై భగీరథ్ జాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అది జరిగిన కొద్ది రోజుల నుంచి గిరిరాజ్, కాసేరా, రజత్ కాసేరాతో పాటు జర్నిలిస్ట్ ఇస్తాయక్ నబీలు సంజయ్‌ను బెదిరించడం మొదలపెట్టారు. ఒత్తిడి తట్టుకోలేక గత నెల 14న సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
![MP Government issues transfer order of a dead man](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-raj-01-transfef-order-pkg-mp10053_01092021232101_0109f_1630518661_453.jpg)
సంజయ్ మరణించిన 16రోజుల తర్వాత అతడిని బదిలీ చేస్తూ పట్టణ, గృహశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండమే ఇందుకు కారణమని చెప్పడం గమనార్హం.
మరోవైపు సంజయ్ ఆత్మహత్య కేసులో.. నిందితులు గిరిరాజ్ కాసేరా, రజత్ కాసేరాలను పోలీసులు అరెస్టు చేశారు. జర్నలిస్టు ఇషాతయక్ నబీ, భగీరథ్ జాదవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి : సీఎం పోలికలతో దుర్గామాత విగ్రహం.. ఎక్కడంటే?