దేశంలో ఉత్పరివర్తనం చెందిన కరోనా వైరస్‌ను ఇండియన్ వేరియంట్ అని అన్నందుకుస సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌పై కేసు నమోదైంది. విలేకరులతో మాట్లాడిన కమల్‌నాథ్.. భారత్‌లో మార్పులు చెందిన వైరస్‌ను ఇండియన్ వేరియంట్ అని ప్రపంచం భావిస్తోందని అన్నారు.
ఇందుకు అభ్యంతరం తెలిపిన భాజపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: బారాబంకీ మసీదు కూల్చివేతపై విచారణ కమిటీ