ETV Bharat / bharat

'సైకిల్​ యాత్ర'కు స్పీకర్​ పయనం.. షాక్​ ఇచ్చిన దొంగలు! - మధ్యప్రదేస్ స్పీకర్ సైకిల్ చోరీ

సైకిల్ యాత్ర కోసం మధ్యప్రదేశ్​ అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ సిద్ధవుతున్న క్రమంలో ఆయన సైకిల్​ చోరీకి గురైంది. తన నియోజకవర్గం రీవాలో ఈ యాత్ర చేపట్టేందుకు రైలులో వెళ్లగా సైకిల్​ అదృశ్యమైంది.

mp bhpal bicycle theft news
మధ్యప్రదేశ్ స్పీకర్ సైకిల్ చోరీ
author img

By

Published : Oct 24, 2021, 7:30 PM IST

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ స్పీకర్​, భాజపా ఎమ్మెల్యే గిరీశ్​ గౌతమ్​.. ఆదివారం నుంచి తన నియోజకవర్గం రీవాలో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ యాత్ర ప్రారంభం కంటే ముందే ఆయనకు ఓ అనూహ్య సంఘటన ఎదురైంది. ఈ యాత్ర కోసం ఆయన సిద్ధం చేసుకున్న రూ.30 వేల విలువ చేసే సైకిల్​ చోరీకి గురైంది.

ఈ యాత్ర కోసం గిరీశ్​​ గౌతమ్.. రెండు సైకిళ్లను సిద్ధం చేసుకున్నారు. ఒకదాన్ని రీవాలో వినియోగించేందుకు.. మరొకదాన్ని భోపాల్​లో బ్యాకప్​గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ యాత్ర కోసం 'రీవాంచల్ ఎక్స్​ప్రెస్​ రైలు'లో రీవాకు వెళ్లారు గిరీశ్ గౌతమ్​. అయితే.. భోపాల్​- బీనా మధ్యలో రైలులో తన సైకిల్​ చోరీకి గురైంది. దీనిపై బీనాలో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు గీరీశ్ గౌతమ్.

రైల్వే పోలీసులు.. సైకిల్​ చోరీని ఛేదించే పనిలో ఉన్నారు. మరోవైపు.. రీవాలోని పదారియా గ్రామం నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు గిరీశ్​ గౌతమ్​. ఈ యాత్ర అక్టోబరు 31న దేవ్​తలాబ్​లో ముగియనుంది. చివరిరోజున ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ హాజరుకానున్నారు.

ఇదీ చూడండి: గొర్రెల కోసం వచ్చి ఇంట్లో దూరిన చిరుత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.