ETV Bharat / bharat

కొవిడ్​ను జయించిన శతాధిక వృద్ధుడు- సీఎం ట్వీట్​ - కరోనా నుంచి కోలుకున్న 104ఏళ్ల వృద్ధుడు

మధ్యప్రదేశ్​కు చెందిన 104ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నాడు. భయపడకుండా నిగ్రహంతో.. శాకాహారం తీసుకుంటూ.. వ్యాయామాలు చేస్తూ సానుకూల దృక్పథంతోనే వైరస్​ను జయించినట్లు ఆయన పేర్కొన్నాడు. దీనిపై సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ హర్షం వ్యక్తం చేశారు.

104 years old man
104ఏళ్ల వృద్ధుడు
author img

By

Published : Apr 25, 2021, 9:59 AM IST

ప్రపంచమంతా కరోనా ధాటికి వణికిపోతున్న వేళ.. మధ్యప్రదేశ్​లో 104ఏళ్ల వృద్ధుడు ఆ మహమ్మారిని జయించాడు. దీనిపై సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్​ ఆనందం వ్యక్తం చేశారు.

CM Shivraj Singh
సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్​ ట్వీట్​

"కరోనా నుంచి కోలుకున్న మీ నుంచి ప్రేరణ పొందడం ద్వారా.. కొవిడ్​ రోగులు సరైన చికిత్స పొంది, ఆరోగ్యంగా ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. బిర్దీ చంద్​జీ.. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి."

- సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్​

బెతుల్​ జిల్లాకు చెందిన బిర్దీ చంద్​కు ఈ నెల 5న కరోనా పాజిటివ్​ వచ్చింది. తాను ఏ మాత్రం భయపడలేదని.. ఆస్పత్రికీ వెళ్లలేదని బిర్దీ చంద్​ తెలిపారు. శాకాహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు వెల్లడించారు. ఓ వైద్యుడు సూచించిన మందులను మాత్రం వాడినట్లు చెప్పారు.​

ఇదీ చూడండి: కొవాగ్జిన్ ధర ప్రకటించిన భారత్​ బయోటెక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.