ETV Bharat / bharat

ఆ జర్నలిస్ట్‌ను దిల్లీ తరలించండి: సుప్రీం - యూపీ ప్రభుత్వం

కేరళ జర్నలిస్ట్​ సిద్దిఖీ కప్పన్‌ను చికిత్స నిమిత్తం మథుర జైలు నుంచి దిల్లీకి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన కోలుకున్న తర్వాత తిరిగి మథుర కారాగారానికి తీసుకెళ్లాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది.

Supreme
సుప్రీంకోర్టు
author img

By

Published : Apr 28, 2021, 5:29 PM IST

యూపీ ప్రభుత్వం గతేడాది అరెస్టు చేసిన కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌ను చికిత్స నిమిత్తం మథుర జైలు నుంచి దిల్లీకి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన కోలుకున్న తర్వాత తిరిగి మథుర కారాగారానికి తీసుకెళ్లాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది. కొద్ది రోజుల క్రితమే సిద్దిఖీ కప్పన్‌ కరోనా బారిన పడ్డారు. తన అరెస్టును సవాల్‌ చేస్తూ లేదా ఇతర ఉపశమనం కోసం కప్పన్‌ తగిన వేదికను సంప్రదించే స్వేచ్ఛను న్యాయస్థానం కల్పించింది.

మరోవైపు, కరోనా బారిన పడిన కప్పన్‌కు సరైన వైద్యం అందించాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ కోరింది. మథురలోని కొవిడ్‌ ఆస్పత్రిలో కప్పన్‌ను బెడ్‌కు కట్టేసి చికిత్స అందిస్తున్నారని ఆయన భార్య ఆరోపిస్తున్నారని తెలిపింది. ఆయన ఆహారం తీసుకోలేకపోతున్నారని, టాయిలెట్‌కు కూడా వెళ్లే అవకాశం ఉండటంలేదంటూ ఆమె ఆరోపిస్తున్నారని ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది.

యూపీలోని హథ్రాస్‌లో దళిత యువతి హత్యాచారానికి గురైన ఘటన తర్వాత అక్కడ కుల వైషమ్యాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న కుట్రలో భాగంగానే సిద్ధిఖీ కప్పన్‌ అక్కడకు బయలుదేరినట్లు ఆరోపిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు గతేడాది అక్టోబర్‌లో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: '18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్ షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.