బిహార్ గోపాల్‌గంజ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ మహిళ తన నలుగురు కుమార్తెలను చెరువులో పడేసింది. దీంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అయితే.. పిల్లలను చెరువులో పడేయాటానికి గల కారణాలు తెలియలేదు.
ఏం జరిగిందంటే?
గోపాల్‌గంజ్ జిల్లా కటియాకు చెందిన అస్లాం మియామ్ భార్య.. గౌరా గ్రామంలోని చెరువు దగ్గరకు తన నలుగురు కుమార్తెలను తీసుకెళ్లి.. ఒకరివెంట ఒకరిని నీళ్లలో తోసేసి అక్కడినుంచి పారిపోయింది. ఈ క్రమంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందగా.. మరో చిన్నారి అఫ్రిన్(4) గడ్డిని పట్టుకుని అరవటం ప్రారంభించింది. అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుడు.. అరుపులను విని చిన్నారిని రక్షించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: 'లవర్స్‌తో కలిసి భర్తను మేడపై నుంచి తోసిన భార్య!'