Mother and two daughters committed suicide at Boinpally : సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పరిధిలో భవానీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పెద్ద మరణం తట్టుకోలేక తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం సూర్య నారయణ అనే వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ భార్య విజయ లక్ష్మీతో కలిసి భవానీనగర్ నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి పేరు చంద్రకళ తాను ఎంబీఏ చదువుతోంది. చిన్న అమ్మాయి పేరు సౌజన్య ఆమె దివ్యాంగురాలు.
ఈ క్రమంలో గత ఐదు ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్య నారాయణ.. వచ్చిన సంపాదన అంతా ఆసుపత్రులకు ఇంటి ఖర్చులకే సరిపోయేది. దీంతో కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 4వ తేదీన అనారోగ్యంతో సూర్య నారాయణ మృతి చెందారు. దీంతో ఫ్యామీలీ మానసికంగా కుంగిపోయింది. ఇద్దరు కుమార్తెలతో కాలం గడుపుతున్న విజయ లక్ష్మీ భర్త మరణం తట్టుకోలేక పోయింది. జీవితంపై విరక్తి చెందింది.
ఈ క్రమంలో సూర్య నారాయణ దశ దిన కర్మ అనంతరం.. ఏప్రిల్ 16న ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకొంది. దీనిని గమనించిన స్థానికులు వారిని కాపాడారు. అనంతరం వారికి ధైర్యం చెప్పారు. అయినా ఇంటి పెద్ద లేని లోటుతో వారు రోజురోజుకి బాగా మానసిక వేదనకు లోనయ్యారు. దీంతో గత రాత్రి ఎవరు లేని సమయంలో కుమార్తెలతో కలిసి విజయ లక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే గదిలో ముగ్గురు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పరిశీలించారు.
సూసైడ్ నోట్ లభ్యం: ఇంట్లో మృత దేహాలను పరిశీలించిన పోలీసులు ఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తమకు ఎవరితోను విభేదాలు లేవని.. భర్త చనిపోయిన కారణంగానే తాము మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు రాసి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానిక ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చదవండి: