Most Popular Leader in India 2023 : దిల్లీలో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ముందు అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ అనే సంస్థ ఓ సర్వే నివేదికను విడుదల చేసింది. 80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. వీరిలో 55 శాతం మంది మోదీపై అత్యంత సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. ఐదో వంతు మంది మాత్రమే మోదీపై వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొంది.
పది మంది భారతీయుల్లో ఏడుగురు ప్రపంచంలో భారత్ ప్రబల శక్తిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. 2022 సర్వేలో ఇది 28 శాతం మాత్రమేనని ప్యూ సంస్థ వెల్లడించింది. 24 దేశాలలో 30 వేల 861 మందిని సర్వే చేసినట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 46 శాతం మంది భారత్‌పై సానుకూలంగా ఉన్నారని ప్యూ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఇజ్రాయెల్‌లో 71 శాతం మంది భారత్‌పై సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని వెల్లడించింది. 34 శాతం మంది భారత్‌పై సానుకూలంగా లేరని సర్వేలో వెల్లడైంది. 16 శాతం మంది ఎటువంటి అభిప్రాయాన్ని తెలపలేదని ప్యూ సంస్థ తెలిపింది.
ఇటీవలి కాలంలో అమెరికా ప్రభావం మరింత బలపడుతోందని 49 శాతం భారతీయులు చెప్పగా, 41 శాతం మంది రష్యా ప్రభావం పెరుగుతోందని చెప్పారు. చైనా ప్రభావంపై భారతీయుల స్పందన మిశ్రమంగా ఉందని ప్యూ సంస్థ తెలిపింది. ప్రధాని మోదీ ప్రజాదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదని ప్యూ సంస్థ నివేదికను ఉటంకిస్తూ భాజపా ట్వీట్ చేసింది. మెజారిటీ ప్రజలు ప్రపంచంపై ఇండియా ప్రభావం పెరిగినట్లు విశ్వసిస్తున్నారని పేర్కొంది.
మళ్లీ మోదీనే నంబర్ వన్.. ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్..
కొద్ది రోజుల క్రితం 'మార్నింగ్ కన్సల్ట్' అనే సంస్థ జరిపిన సర్వేలో.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 78 శాతం ప్రజామోదం లభించింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేతగా మోదీనే ముందున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో మోదీ అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
PM Rojgar Mela : 'వృద్ధిబాటలో భారత ఆర్థిక వ్యవస్థ.. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు'
అంతా 'మోదీ'మయమే.. తగ్గని ప్రజాదరణ.. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై!