తరచూ చోరీలకు పాల్పడుతున్న తిరువర్ప్ అజీ(48)ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో కొల్లం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన దొంగతనంలో నిందితుడిగా అజీను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అజయన్ చెప్పిన విషయాలు విని అవ్వాక్కవటం పోలీసుల వంతైంది.
28 ఏళ్లు జైలులోనే...
అజీ తన 48ఏళ్ల జీవితంలో 28 సంవత్సరాలు జైలులోనే గడిపాడు. నాలుగేళ్ల క్రితమే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నాలుగేళ్లలో దాదాపు వందకు పైగా చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనాల్లో అజీ కొత్త విధానాలను అవలంబిస్తాడు. ఇళ్లల్లో చోరీ చేయకుండా కేవలం దుకాణాల్లోనే దొంగతనాలు చేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో పాఠశాలల్లో దొంగతనాలు మొదలుపెట్టాడు. ఎర్నాకులం, కొల్లం, కొట్టాయం మొదలుగు ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలు చేస్తున్నాడు.
సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా...
గత నెలలో కొల్లం పశ్చిమ బాలికల ఉన్నత పాఠశాల కార్యాలయం తలుపును పగలగొట్టి... లోపల ఉన్న సొమ్మును అపహరించాడు అజీ. పాఠశాలలో ఉన్న సీసీటీవీ కెమెరాలను సైతం ధ్వంసం చేశాడు. అయితే దొంగలించినప్పుడు సన్నివేశాలు రికార్డు అయినట్టు అజీ గమనించలేదు. వాటి ఆధారంగా జిల్లా సరిహద్దుల్లో తిరుగుతున్న అజీని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ చదవండి: అడవికి వెళ్లి గిరిజన యువకుడు అదృశ్యం.. చివరకు!