దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు అధికారులు. ఆదివారం సాయంత్రం నాటికి 58,03,617మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క ఆదివారమే 28,059 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించిన మూడో దేశంగా ప్రస్తుతం భారత్ ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్లు ఉన్నాయి.
ఇదీ చదవండి : మరో 7 కొవిడ్ టీకాలు సిద్ధమవుతున్నాయి: కేంద్రం