కర్ణాటక దావణగెరె జిల్లా బెన్నెహళ్లి గ్రామంలో 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఓ ఇంట్లో బారసాల కార్యక్రమానికి హాజరైన వీరంతా అక్కడ భోజనం చేసిన తర్వాత వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే వీరందరినీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స అనంతరం చాలా మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
20 మంది మాత్రం జగలూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. జగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ ఘటన జరిగింది.
ఇదీ చూడండి: Vaccine Side Effects: భారత్లో కరోనా టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే!