నైరుతి రుతుపవనాలతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) వర్షపాతంలో 103 శాతం మేర వానలు కురుస్తాయని అంచనా వేసింది.
ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదుకు 60 శాతం ఆస్కారం ఉంటుందని తెలిపింది స్కైమెట్. 15 శాతం మేర అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని లెక్కగట్టింది.
ఎల్పీఏలో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు.
ఇదీ చూడండి: గ్రామాల బాట పట్టిస్తున్న 'లాక్డౌన్ భయం'