నైరుతి రుతుపవనాలు రెండు రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 3న తీరాన్ని తాకనున్నట్లు వెల్లడించింది.
"జూన్ 1న నైరుతి దిశగా వీచే గాలులు బలపడనున్నాయి. ఈ క్రమంలో కేరళలో భారీగా వర్షాలు పడనున్నాయి. జూన్ 3న నైరుతి రుతుపవనాలు కేరళ తీరం తాకనున్నాయి."
-ఐఎండీ.
ఈ రుతుపవనాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లోనూ రానున్న ఐదు రోజుల్లో వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. తొలుత ఐపీఎండీ కూడా మే 31 నే రుతుపవనాలు తీరాన్ని తాకనున్నట్లు తెలిపింది.