ETV Bharat / bharat

మెట్రో స్టేషన్లలో కోతుల సమస్యకు.. 'కటౌట్'  పరిష్కారం​ - కొండముచ్చుల కటౌట్లు

మెట్రో స్టేషన్​లో కోతుల బెదడ తప్పించేందుకు అధికారులు వినూత్నంగా ప్రయత్నించారు. కొండముచ్చుల కటౌట్లను స్టేషన్లలో ఏర్పాటు చేశారు. వీటిని చూసి కోతులు స్టేషన్ దరిదాపుల్లోకి రావడం లేదని అధికారులు చెబుతున్నారు.

MONKEY METRO
మెట్రో స్టేషన్లలో కొండముచ్చులు
author img

By

Published : Nov 1, 2021, 12:02 PM IST

ప్రయాణికులను కోతుల బెడద నుంచి తప్పించేందుకు లఖ్​నవూ మెట్రో (Lucknow Metro news) అధికారులు వినూత్నంగా ఆలోచించారు. కోతులు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశాల్లో కొండముచ్చుల కటౌట్​లను ఏర్పాటు చేశారు. వీటిని చూసి కోతులు భయపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

MONKEY METRO
మెట్రో స్టేషన్​లో కొండముచ్చు కటౌట్

ఇటీవల లఖ్​నవూ మెట్రో స్టేషన్​లో (Lucknow Metro news) వానరాల సంచారం పెరిగిపోయింది. కోతిచేష్టలతో ప్రయాణికులను ఇవి విసిగిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతులు అందాయి. కోతులు దాడి చేసే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ వినూత్న ఆలోచన అమలు చేశారు. మొత్తం తొమ్మిది స్టేషన్లలో కొండముచ్చుల కటౌట్లను నెలకొల్పారు.

MONKEY METRO
మెట్రో స్టేషన్​లో కొండముచ్చు కటౌట్
MONKEY METRO
.

ఫలించని సౌండ్లు..

కటౌట్లు నెలకొల్పే ముందు ఇతర ప్రయత్నాలు కూడా చేశారు ఇక్కడి అధికారులు. కోతులను బెదరగొట్టేందుకు కోపంతో ఉన్న కొండముచ్చుల అరుపులను ప్లే చేశారు. ఇది ప్రారంభంలో కొంతవరకు ఫలించింది. కానీ, తర్వాత కోతులు ఈ విషయాన్ని గుర్తించాయి. స్టేషన్​లో కొండముచ్చులు లేవని గ్రహించాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

దీంతో ఇప్పుడు కొండముచ్చుల కటౌట్లను ఏర్పాటు చేసి వాటి సౌండ్​లను ప్లే చేస్తున్నారు. ఈ ప్రయత్నం చాలా వరకు ఫలించిందని, ప్రస్తుతం కోతులు స్టేషన్ దరిదాపుల్లోకి రావడం లేదని ఓ అధికారి చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ కటౌట్లను ఒక్కచోటే ఉంచితే నకిలీవి అని కోతులు గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. కొద్దిరోజుల తర్వాత మార్చేస్తున్నారు.

ఇదీ చదవండి: కాన్పుర్​లో జికా కలకలం- కొత్తగా ఆరు కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.