ETV Bharat / bharat

మంకీ ఫీవర్ కలకలం- అక్కడ తొలి కేసు నమోదు - monkey fever is caused by

Monkey Fever karnataka: దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ భయపెడుతోంది. తాగాజా కర్ణాటకలో ఓ మహిళకు(57) మంకీ ఫీవర్​ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

Monkey Fever karnataka
మంకీ ఫీవర్
author img

By

Published : Jan 22, 2022, 11:00 AM IST

Monkey Fever karnataka: కర్ణాటక శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్ కలకలం రేపింది. తీర్థహళ్లి మండలంలో ఓ మహిళకు(57) ఈ జ్వరం వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఏడాది మంకీ ఫీవర్ మొదటి కేసు నమోదైందని పేర్కొన్నారు.

జ్వరంతో ఆస్పత్రికి చేరిన మహిళకు సంబంధిత లక్షణాలు ఉండడంతో డాక్టర్లు పరీక్షలు చేశారు. దీంతో మంకీ ఫీవర్​ అని తేలింది. తీర్థహళ్లీ జేసీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

రెండేళ్ల క్రితం రాష్ట్రంలో సాగర్ మండలంలోని అరళగోడు గ్రామంలో మంకీ ఫీవర్​తో 26 మంది మరణించారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు వెలుగులోకి రాలేదు.

monkey fever symptoms: మంకీ ఫీవర్​ దక్షిణాసియాలో కోతుల ద్వారా మనుషులకు సోకిన వైరల్ జబ్బు. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: భయపెడుతున్న థర్డ్​ వేవ్​.. సుడిగాలిలా ఒమిక్రాన్‌ విజృంభణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.