ETV Bharat / bharat

mohan bhagwat news: 'దేశ విభజనకు ముఖ్య కారణం అదే' - మోహన్ భాగవత్

mohan bhagwat news: హిందువులు లేకుండా భారతదేశం లేదన్నారు ఆర్​ఎస్​ఎస్ అధిపతి మోహన్ భాగవత్. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి అని.. అందరూ క్రమశిక్షణతో నివసించి దీన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు.

Mohan Bhagwat
మోహన్ భాగవత్
author img

By

Published : Nov 28, 2021, 7:10 AM IST

mohan bhagwat news: హిందువులం అన్న భావనను మరచిపోవడం వల్లనే దేశ విభజన జరిగి పాకిస్థాన్​ ఏర్పడిందని ఆర్​ఎస్​ఎస్ అధిపతి మోహన్ భాగవత్ అన్నారు. శనివారం గ్వాలియర్​లోని జివాజీ విశ్వవిద్యాలయం అటల్​ బిహారీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ హిందువుల స్వాభిమానాన్ని ప్రస్తావించారు.

" హిందువులు లేకుండా భారతదేశం లేదు. భారతదేశం లేకుండా హిందువులు కూడా లేరు. హిందువులను, భారతదేశాన్ని విడదీసి చూడలేం. కానీ తాము హిందువులం అన్న భావాన్ని చాలా మంది మరిచిపోయారు. వారు హిందువులు కారని ముస్లింలు కూడా అనుకున్నారు. అందువల్లనే పాకిస్థాన్ ఏర్పడింది. తొలుత హిందువులమని భావించే వారి సంఖ్య తగ్గింది. తరువాత హిందువుల సంఖ్యే తగ్గింది. పాకిస్థాన్ ఏర్పడటం వల్ల ఇక ఇది హిందుస్థాన్ అయింది. హిందూమతానితో సంబంధం ఉన్నవాటినే ఇక్కడ అభివృద్ధి చేయాలి."

-- మోహన్ భాగవత్, ఆర్​ఎస్​ఎస్ అధిపతి

ప్రస్తుత పరిస్థితిలో మరోసారి దేశ విభజన జరగదని భాగవత్ అన్నారు. అయితే హిందువులు సంఘటితం కావాల్సి ఉందని. అదే సమయంలో ముస్లింలు ఉండకూడదని ఎవరూ అనకూడదన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి.. అందరూ క్రమశిక్షణతో నివసించి దీన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'చట్టాల ప్రభావాన్ని అంచనా వేయకపోవడం వల్లే సమస్యలు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.