Mohan Bhagwat Pran Pratishtha Invitation : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్‌కు బుధవారం అహ్వానం అందింది. ఈ మేరకు అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింట్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ దిల్లీలోని భాగవత్ ఇంటికి వెళ్లి ఆహ్వానం అందించారు. ఈ మేరకు మాట్లాడిన భాగవత్ శ్రీరామమందిర ప్రాణప్రతిష్ఠలో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప అదృష్టమని అన్నారు.
"చాలా ఏళ్ల తర్వాత మనం భారత్ స్వీయ చిహ్నాన్ని పునర్నిర్మించాము. మనం ధర్మబద్ధంగా చేసిన ప్రయత్నాల కారణంగా అది సాధ్యమైంది. ఇది ఒక విధంగా భారత్ తనంతట తానుగా నిలబడిందని, ఇప్పుడు ప్రపంచ శ్రేయస్సు, శాంతి కోసం ముందుకు సాగుతుందని ప్రపంచానికి చాటి చెప్పడం. ఈ ప్రాణప్రతిష్ఠ ద్వారా ఎన్నో దశాబ్దాలుగా వెతుకుతున్న దిశను మనం కొనుగొన్నాము."
-- మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్
అయోధ్య రామయ్యకు కానుకల వెల్లువ!
ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్య రామయ్యకు కానుకలు వెళ్లువెత్తుతున్నాయి. 108 అడుగుల అగరుబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కిలోల పంచలోహ మహాదీపం, బంగారు పాదుకలు (హైదరాబాద్ నుంచి), 10 అడుగుల తాళం చెవులు, ఏకకాలంలో 8 దేశాల సమయం చూపించే గడియారం వంటి అనే కానుకలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రామయ్యకు అందుతున్నాయి. నేపాల్‌లోని సీతమ్మ జన్మస్థలి అయిన జనక్‌పుర్ నుంచి 30 వాహనాల్లో మూడు వేలకు పైగా కానుకలు తెచ్చారు భక్తులు. శ్రీలంక నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధి బృందం వారి దేశంలో ఉన్న 'అశోకవనం' నుంచి శిలను తీసుకువచ్చింది.
ఇక గుజరాత్ నుంచి ధ్వజస్తంభాలతోపాటు స్వర్ణతాపడం చేసిన దాదాపు 5 అడుగుల ఢమరుకం వచ్చింది. నాగ్‌పుర్‌కు చెందిన షెఫ్ విష్ణు మనోహర్ ప్రాణప్రతిష్ఠ రోజున భక్తుల కోసం ఏడువేల కిలోల సంప్రదాయ వంటకం 'రామ్ హల్వా' సిద్ధం చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు మథురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవాసంస్థాన్ నుంచి యజ్ఞం కోసం 200 కిలోల లడ్డూలు పంపించనున్నారు. తిరుపతిలోని తితిదే, భక్తులకు పంపిణీ కోసం లక్ష లడ్డూలు పంపిస్తామని ప్రకటించింది. గుజరాత్‌లోని సూరత్ నుంచి సీతమ్మకు ప్రత్యేక చీర, కంఠహారం పంపారు. సుగంధ ద్రవ్యాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి ప్రత్యేక పరిమళ ద్రవ్యాలు, పన్నీరు అయోధ్యకు పంపుతున్నట్లు కన్నౌజ్ అత్తర్స్ అండ్ పర్‌ఫ్యూమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ త్రివేది వెల్లడించారు.
జనవరి 16 నుంచే వేడుకలు
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22 మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగుతుంది. సుమారు 4,000 మంది సాధువులు ఇందులో పాల్గొంటారు. ఇక ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే కార్యక్రమాలు జనవరి 16 నుంచే మొదలు కానున్నాయి. 16న విగ్రహాన్ని చెక్కిన ప్రాంగణంలో పూజలు చేసి శిల్పిని సన్మానిస్తారు. 17న గర్భగుడిని సరయూ నదీ జలాలతో సంప్రోక్షన చేస్తారు. 18న గంధం, సుగంధితో, 19న ఉదయం ఫలాలతో సాయంత్రం చిరుధాన్యాలతో పూజలు చేస్తారు. 20న ఉదయం పూలతో సాయంత్రం నెయ్యితో రాముడికి పూజలు నిర్వహిస్తారు. 21న తేనె, స్వీట్లను అందించి రాముడిని నిద్రబుచ్చనున్నారు. అనంతరం 22న ప్రాణప్రతిష్ఠ జరిగే రాముడి కళ్లగంతలు విప్పి అద్దంలో చూపించనున్నారు.
'మా ఇంట్లో రాముడు పుట్టాలి, ప్రాణప్రతిష్ఠ రోజే డెలివరీ చేయండి'- వైద్యులను కోరుతున్న గర్భిణులు
ప్రాణప్రతిష్ఠకు 7వేల మంది అతిథులు- విదేశాల్లో ఉన్నా స్వయంగా వెళ్లి ఆహ్వానం