ETV Bharat / bharat

జుబైర్​కు సుప్రీంలో ఊరట.. అన్ని కేసుల్లో బెయిల్.. జైలు నుంచి విడుదల!

Zubair case supreme court: ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ జుబైర్​కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. యూపీలో నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

zubair bail supreme court
zubair bail supreme court
author img

By

Published : Jul 20, 2022, 2:59 PM IST

Updated : Jul 20, 2022, 3:06 PM IST

Alt news Zubair case: ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్​కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనపై ఉత్తర్​ప్రదేశ్​లో ఆరు ఎఫ్ఐఆర్​లు నమోదు కాగా.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబైర్​ను ఆదేశించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం జుబైర్​కు లభించింది.

జుబైర్​పై యూపీలో నమోదైన కేసులన్నింటినీ దిల్లీ పోలీసు స్పెషల్ విభాగానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జుబైర్ ట్వీట్లపై దర్యాప్తు చేసేందుకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్​ను రద్దు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి జుబైర్​పై ప్రస్తుతం నమోదైన కేసులతో పాటు భవిష్యత్​లో నమోదయ్యే ఎఫ్ఐఆర్​లు సైతం దిల్లీకి బదిలీ అవుతాయని స్పష్టం చేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్​లను రద్దు చేయాలని దిల్లీ హైకోర్టును జుబైర్ ఆశ్రయించవచ్చని సుప్రీం తెలిపింది.

ఇదీ చదవండి:

Last Updated : Jul 20, 2022, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.