ETV Bharat / bharat

Board Exam New Rules 2023 : ఇకపై ఏడాదికి 2సార్లు బోర్డ్​ ఎగ్జామ్స్​.. ఇంటర్​లో రెండు లాంగ్వేెజెస్​ నేర్చుకోవాల్సిందే! - కేంద్ర విద్యాశాఖ కొత్త నిబంధనలు

Board Exam New Rules 2023 : బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తామని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇంటర్​ విద్యార్థులు ఒకటికి బదులుగా రెండు భాషలను అభ్యసించవలసి ఉంటుందని పేర్కొంది.

MOE New Curriculum
MOE New Curriculum
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 2:18 PM IST

Updated : Aug 23, 2023, 4:09 PM IST

Board Exam New Rules 2023 : ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యార్థులు.. మంచి మార్కులు సంపాదించుకోవడంలో ఇది సహాయపడుతుందని చెప్పింది. జాతీయ విద్యా విధానం ప్రకారం కొత్త పాఠ్య ప్రణాళిక సిద్ధంగా ఉందని.. దాని ప్రకారమే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు రూపొందించాలని చెప్పింది.

Board Exam New Policy : కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం.. 11, 12వ తరగతి విద్యార్థులు.. రెండు లాంగ్వేజెస్​ను నేర్చుకోవాలి. అందులో ఒకటి భారతీయ భాష అయ్యి ఉండాలి. 11, 12వ తరగతి విద్యార్థులు.. సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం పొందుతారు. కేవలం ఎంచుకున్న స్ట్రీమ్​లోని సెబ్జెక్ట్​లే​ పరిమితం కాకుండా.. మిగతా సెబ్జెక్టులు కూడా నేర్చుకోవచ్చు.

విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకే..
MOE New Curriculum News : '11, 12 తరగతి విద్యార్థులు రెండు భాషలను అభ్యసించాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి భారతీయ భాషై ఉండాలి. ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు మంచి పనితీరు కనబరిచేందుకు తగినంత సమయం దొరుకుతుంది. అలాగే వారు మంచి మార్కులు సాధించేందుకు ఉపయోగపడుతుంది. బోర్డు పరీక్షల కోసం విద్యార్థులు నెలల తరబడి పాఠ్యాంశాలను కంఠస్థం చేయకుండా.. వారి సామర్థ్యాలను పెంచుకునేందుకు సాయపడుతుంది. అలాగే 11,12 తరగతుల విద్యార్థులు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి స్ట్రీమ్‌లోని సబ్జెక్ట్​​లే కాకుండా ఏ సబ్జెక్ట్​నైనా ఎంపిక చేసుకోవచ్చు.' అని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.

టాపర్లు హెలికాప్టర్‌ టూర్​..
గతేడాది పది, 12 తరగతి బోర్డు పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. విద్యార్థుల్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆయా తరగతుల్లో టాప్‌-10 విద్యార్థులకు హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం కల్పించారు. రాష్ట్రస్థాయి/ జిల్లా స్థాయిల్లో టాపర్లుగా నిలిచినవారికి హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. పిల్లలను మరింతలా ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని భూపేశ్ బఘేల్ తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సొంత స్కూల్​లోనే బోర్డ్​ పరీక్షలు- జులై చివర్లో ఫలితాలు

10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు రద్దు పిటిషన్ కొట్టివేత

Last Updated : Aug 23, 2023, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.