కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల కల్గే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ భాజపా నేతలకు సూచించారు. భాజపా పదాధికారుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో కలిసి ప్రధాని పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో జరగనున్న అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ జాతీయ మోర్చాల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ధన్యవాద తీర్మానం..
కరోనా కారణంగా మరణించిన వారికి ఈ సమావేశంలో నివాళి అర్పించారు. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు సహా ఆత్మ నిర్భర్ భారత్, 3 సాగు చట్టాలపై సమావేశంలో చర్చించారు. కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్న తీరు, నాయకత్వ లక్షణాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం.. తీర్మానం ఆమోదించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతుల ఆదాయం పెంచేందుకు చేపట్టిన చర్యలను ప్రశంసిస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు.
ఇదీ చదవండి:భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం- మోదీ హాజరు