ETV Bharat / bharat

మోదీ అధ్యక్షతన సముద్ర భద్రతపై ఐరాసలో చర్చ! - UNSC

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సముద్ర భద్రతపై సోమవారం చర్చ జరగనుంది. ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. యూఎన్‌ఎస్‌సీలో ఓ బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కానున్నారు.

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Aug 9, 2021, 6:27 AM IST

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం భద్రత మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌ ఉండటం వల్ల ఆయనకు ఈ అవకాశం వచ్చింది. ఆ విధంగా యూఎన్‌ఎస్‌సీలో ఓ బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కానున్నారు.

భద్రత మండలి సభ్య దేశాల నేతలు, ఐరాస అనుబంధ సంస్థలతో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉందని ప్రధాని కార్యాలయం తెలిపింది. సముద్ర నేరాలు, అభద్రతను సమర్థంగా ఎదుర్కోవడం, తీర ప్రాంతాల్లోని దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని పేర్కొంది.

ఇదీ చూడండి: పెగసస్​పై మోదీని ప్రశ్నిస్తూ విపక్షాల 3 నిమిషాల వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.