బ్రిటన్‌లో జరుగుతున్న జి-7 శిఖరాగ్ర సదస్సు(G-7 summit) రెండో రోజుకి చేరుకుంది. 'బిల్డ్ బ్యాక్ బెటర్' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తోన్న ఈ సదస్సులో నేడు, రేపు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పాల్గొననున్నారు. ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరు కానున్న మోదీ పలు అంశాలపై ప్రసంగిచనున్నారు.
జి-7 కూటమిలో బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడాలు సభ్య దేశాలుగా ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికాలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలతో పాటు.. ప్రజారోగ్యం, వాతావరణ మార్పులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: వచ్చేవారం ఐరాసలో మోదీ ప్రసంగం