ETV Bharat / bharat

'ప్రారంభ్​' సదస్సులో ప్రసంగించనున్న మోదీ - మోదీ న్యూస్​ లేటెస్ట్​

స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు 'ప్రారంభ్​'లో శనివారం సాయంత్రం ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమానికి వర్చువల్​గా హాజరుకానున్నారు. 25 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ వక్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

Modi to address Startup India International Summit on Saturday
'ప్రారంభ్​' సదస్సులో ప్రసంగించనున్న మోదీ
author img

By

Published : Jan 16, 2021, 5:09 AM IST

స్టార్టప్​ ఇండియా అంతర్జాతీయ సదస్సులో శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రసగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కర్యక్రమంలో వర్చువల్​గా పాల్గొనున్నారు. 'ప్రారంభ్'​ పేరిట ఈ సమావేశాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.

2018 ఆగస్టులో కాఠ్మాండులో నిర్వహించిన బిమ్​స్టెక్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ, ఈ కార్యక్రమాన్ని భారత్​లో నిర్వహిస్తామని అప్పుడే ప్రకటించారు. దేశం​లో అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు 2016 జనవరి 16న 'సార్టప్​ ఇండియా'కు శ్రీకారం చుట్టారు మోదీ. దీని ఐదో వార్షికోత్సవం సందర్భంగా స్టార్టప్​ ఇండియా అంతర్జాతీయ సదస్సును కేంద్రం నిర్వహిస్తోంది.

ఈ సదస్సులో 25 దేశాలకు చెందిన ప్రతినిధులు, 200మంది అంతర్జాతీయ వక్తలు పాల్గొంటున్నారు. వీరినుద్దేశించి శనివారం సాయంత్రం మోదీ ప్రసంగిస్తారు.

ఇదీ చూడండి: అంబానీ, అదానీల మేలు కోసమే సాగు చట్టాలు: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.