ETV Bharat / bharat

ప్రచారంలో మోదీ దూకుడు- 23 సభలకు హాజరు - modi election campaign

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా భాజపా తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 ప్రచార సభల్లో పాల్గొన్నారు. బంగాల్​లో​ ఈ వారం మరిన్ని ప్రచార కార్యక్రమాలకు హాజరు కానున్నారు.

modi in election campaign
ప్రచారంలో మోదీ దూకుడు- 23 సభలకు హాజరు
author img

By

Published : Apr 4, 2021, 10:57 AM IST

Updated : Apr 4, 2021, 11:42 AM IST

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నేపథ్యంలో భాజపా తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 ప్రచార సభల్లో పాల్గొన్నారు. గత మూడురోజుల్లోనే.. నాలుగు రాష్ట్రాల్లో 10 ర్యాలీలకు హాజరయ్యారు.

బంగాల్​లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించి అధికారాన్ని చేపట్టాలని, అసోంలో మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భాజపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండు రాష్ట్రాలపై మోదీ ఎక్కువ దృష్టిపెట్టారు. వీటితో పాటు కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులోనూ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

బిజీ షెడ్యూల్​ ఉన్నప్పటికీ.. దేశంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్​ కార్యక్రమాలపై కూడా మోదీ దృష్టి సారించారని అధికార వర్గాలు తెలిపాయి. బంగాల్​ మినహా ఏప్రిల్​ 6న అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ నేపథ్యంలో బంగాల్​లో మోదీ ఈ వారం మరిన్ని సభల్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:కేరళ ఎన్నికల నుంచి తప్పుకున్న ట్రాన్స్​జెండర్​

Last Updated : Apr 4, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.