ETV Bharat / bharat

ట్విట్టర్ యూజర్​కు మోదీ బర్త్​డే విషెస్- నెటిజన్ల ఆశ్చర్యం - నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​లో పంపిన ఓ సందేశం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ అభిమాని కోరిక మేరకు ఆయన ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మోదీ సందేశం చూసిన ఆమె.. ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు మరొకరు లేరంటూ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

modi suprise
ట్విట్టర్ యూజర్​కు మోదీ బర్త్​డే విషెస్- నెటిజన్ల ఆశ్చర్యం
author img

By

Published : Jul 9, 2021, 1:07 PM IST

ట్విట్టర్​లో దాదాపు 7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఓ సాధారణ వ్యక్తికి ప్రత్యేకంగా పట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నెటిజన్లను సర్​ప్రైజ్​ చేసింది. మోదీ సందేశం చూసిన ఆ అభిమాని పట్టరాని సంతోషంలో మునిగిపోయారు.

డెక్స్​ట్రో అనే వైద్యురాలు ప్రధాని మోదీకి ఫ్యాన్​. మంగళవారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తనకు మోదీతో శుభాకాంక్షలు చెప్పించాలని ఆయన అనుసరించే ఓ వ్యక్తిని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం మోదీ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన డెక్స్​ట్రోకు బర్త్​డే విషెస్ చెప్పారు. అంతే కాదు ఆమె విజ్ఞప్తి మేరకు ఆమె పుట్టినరోజును 'డెక్స్​ట్రోదివస్'​గా అభివర్ణించారు.

  • Happy Birthday...or as you are describing it - Dextrodiwas... :)

    Have a great year ahead. https://t.co/X0Z5DrdMQ1

    — Narendra Modi (@narendramodi) July 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ సందేశం చూసి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రపంచంలో తనకంటే అదృష్టవంతురాలు మరొకరు లేరంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మోదీ నుంచి శుభాకాంక్షలు పొందడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు ధన్యవాదాలు తెలిపారు.

  • Thankyou ajit. Dextrodiwas par please ask pm to wish me as you follows you both 🤭

    — Dextro (@Dextrocardiac1) July 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: నవదంపతులను సర్​ప్రైజ్​ చేసిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.