ETV Bharat / bharat

Modi On Olympics : '2029 యూత్​ ఒలింపిక్స్​ ఆతిథ్యానికి భారత్​ రెడీ.. 2036 కోసం భగీరథ ప్రయత్నం!' - ఒలింపిక్ క్రీడలపై ప్రధాని మోదీ

Modi On Olympics : 2036 ఒలింపిక్స్​ నిర్వహణకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని భారత్​ వదులుకోదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 2029 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్​ సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Modi On Olympics
Modi On Olympics
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 9:42 PM IST

Modi On Olympics : 2029 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్​ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి తమకు కచ్చితంగా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. 2036 ఒలింపిక్స్​ నిర్వహణకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని భారత్​ వదులుకోదని స్పష్టం చేశారు. దేశంలో ఒలింపిక్స్​ నిర్వహణ.. 140 కోట్ల మంది భారతీయుల కల అని అభివర్ణించారు. ప్రపంచ స్పోర్ట్స్​ టోర్నమెంట్​లను నిర్వహించే సామర్థ్యాన్ని భారత్​ ప్రదర్శించిందని చెప్పారు. మహరాష్ట్ర ముంబయిలో నీతా ముకేశ్​ అంబానీ కల్చరల్ సెంటర్​లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ సెషన్​లో​ మోదీ ప్రసంగించారు.

  • VIDEO | "Before 2036 Olympics, India also wants to host the 2029 Youth Olympics. I believe, India will get constant support from the IOC," says PM Modi at the 141st International Olympic Committee (IOC) Session at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) in Mumbai. pic.twitter.com/wAdlnuskHu

    — Press Trust of India (@PTI_News) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్​లో క్రీడల వారసత్వం..
Modi At NMACC Mumbai : సింధు లోయ నాగరికత నుంచి వేదాల యుగం వరకు.. మన దేశంలో క్రీడల వారసత్వం సుసంపన్నంగా ఉందని మోదీ చెప్పారు. 'ఒకే భూమి- ఒకే కుటుంబం- ఒక భవిష్యత్తు' అనే భావనను క్రీడలు బలపరుస్తున్నట్లు చెప్పారు. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. భారత్​లో 40 ఏళ్ల తర్వాత ఐఓసీ సెషన్​ జరగడం.. అది కూడా ముంబయిలో జరగడం దేశానికి గర్వకారణంగా చెప్పారు.

  • VIDEO | "From Indus Valley civilisation to the Vedic era, the legacy of sports has been prosperous in every time period of India," says PM Modi at the 141st International Olympic Committee (IOC) Session at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) in Mumbai. pic.twitter.com/eKU43uudW7

టీమ్​ఇండియాకు అభినందనలు..
Ind Vs Pak World Cup 2023 Modi : భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. "అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో చరిత్రాత్మక విజయం సాధించినందుకు టీమ్​ఇండియాను అభినందిస్తున్నాను. మన సంస్కృతితోపాటు భారతీయుల జీవనశైలిలో క్రీడలు ముఖ్యమైన భాగం" అని మోదీ తెలిపారు.

  • VIDEO | "India is leaving no stone unturned in its efforts to ensure that Olympics are organised in India in 2036," says PM Modi at the 141st International Olympic Committee (IOC) Session at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) in Mumbai. pic.twitter.com/rBUgZHDQoX

అతి పెద్ద ప్రజాస్వామ్యానికి మోదీ రూపశిల్పి..
IOC Session Mumbai 2023 : 40 సంవత్సరాల తర్వాత భారత్​లో చరిత్రాత్మక ఐఓసీ సెషన్​కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ తెలిపారు. ప్రధాని మోదీ.. ఈ కార్యక్రామానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి నవ భారత రూపశిల్పి మోదీ అంటూ నీతా అంబానీ కొనియాడారు. క్రీడలకు మోదీ ఇచ్చిన మద్దతే ఈ సెషన్​ ఇక్కడ జరిగేలా చేసిందని ఆమె అన్నారు. భారత్​ ఆర్థికంగా, క్రీడల్లో కూడా అభివృద్ధి చెందుతోందని ఐఓసీ ప్రెసిడెంట్​ థామస్​ బాచ్​ కొనియాడారు. భారత్​ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశంగా వర్ణించారు.

  • PHOTO | PM Modi at the 141st International Olympic Committee (IOC) Session at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) in Mumbai. pic.twitter.com/zweKIRfBIT

  • #WATCH | Mumbai | At the 141st IOC Session, International Olympic Committee (IOC) member Nita Ambani says, "..It is an absolute honour for us to host this historic IOC Session in India after 40 years and in Mumbai for the first time ever..." pic.twitter.com/PeDbx6YSRQ

    — ANI (@ANI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Cricket In Olympics 2028 : ఒలింపిక్స్​లో క్రికెట్​కు చోటు.. ఐఓసీ కీలక నిర్ణయం.. ఎప్పటి నుంచంటే?

Neeraj Chopra Paris Olympics : నీరజ్ చోప్రా భళా.. పారిస్​ ఒలింపిక్స్​కు అర్హత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.