ETV Bharat / bharat

'డీప్‌ఫేక్‌'పై మోదీ ఆందోళన- సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో కేంద్రం భేటీ - రష్మిక డీప్​ఫేక్ వీడియో మోదీ రియాక్షన్

Modi On Artificial Intelligence : సెలబ్రిటీలను భయపెడుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు.

Modi On Artificial Intelligence
Modi On Artificial Intelligence
author img

By PTI

Published : Nov 17, 2023, 1:44 PM IST

Updated : Nov 17, 2023, 3:44 PM IST

Modi On Artificial Intelligence : 'డీప్ ఫేక్‌లను' సృష్టించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి డీప్‌ఫేక్‌ వీడియోలు ( Pm Modi on Deepfake ) సృష్టించడం పెను ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలని కోరారు. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 'దివాలీ మిలన్​' కార్యక్రమానికి హాజరైన మోదీ.. పాత్రికేయులను ఉద్దేశించి ప్రసంగించారు.

"నేను ఈ మధ్యే ఓ వీడియో చూశా. అందులో నేను గర్బా పాట పాడుతున్నట్లు ఉంది. ఇలాంటివి ఆన్​లైన్​లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. డీప్​ఫేక్ ఆందోళనకరమైన సమస్యగా మారింది. మనందరికీ ఇది చాలా సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ను ఉపయోగించి ప్రమాదకరమైన కంటెంట్​ను వ్యాప్తి చేస్తే కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

'వోకల్ ఫర్ లోకల్​కు ప్రజల మద్దతు'
భారతదేశాన్ని 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం)గా మార్చాలనే తన సంకల్పాన్ని మోదీ.. ఈ సందర్భంగా ప్రస్తావించారు. వోకల్​ ఫర్​ లోకల్​కు ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. కొవిడ్​ సమయంలో భారత్​ సాధించిన విజయాలు.. దేశ అభివృద్ధి ఇప్పట్లో ఆగదనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాయని చెప్పారు.

సోషల్ మీడియా సంస్థలతో సమావేశం
మరోవైపు.. డీప్​ఫేక్ సమస్యను పరిష్కరించాలని సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్రం నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని కోరింది. ఈ మేరకు ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్​కు సందేశం పంపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డీప్​ఫేక్ వంటి కంటెంట్​ ఎక్కువగా వ్యాప్తి చెందడానికి సోషల్ మీడియాలు ప్రధాన కారణమని భావిస్తున్న నేపథ్యంలో.. ఆ కంపెనీలతో చర్చించడం మంచిదని పేర్కొన్నాయి.

'మహా నకిలీ' డీప్​ఫేక్ పరిజ్ఞానం.. ఒకే సమయంలో వివిధ రూపాల్లోకి మారి

సోషల్ మీడియా సంస్థలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు ఇప్పటికే వెల్లడించాయని, ఈ నేపథ్యంలోనే సమావేశం నిర్వహించి చర్చించేందుకు కేంద్రం సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సహా వచ్చే ఏడాది లోక్​సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. డీప్​ఫేక్ సమస్యపై కేంద్రం ఆందోళన చెందుతోందని వివరించాయి. కేంద్ర ఐటీ శాఖ, సంబంధిత మంత్రిత్వ శాఖలు దీనిపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నాయని వివరించాయి.

నటి వీడియోతో ఆందోళన!
ఇటీవల నటి రష్మిక డీప్​ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారడం తీవ్ర కలకలం సృష్టించింది. అనేక మంది సెలబ్రిటీలు ఈ వీడియోను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. దీంతో డీప్​ఫేక్​పై ఆందోళన మిన్నంటింది. సమస్యను పరిష్కరించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి.

Deep Fake Video Call Scam : అర్జెంట్​గా డబ్బులు కావాలని ఫ్రెండ్​ కాల్​ చేశాడా?.. అది డీప్​ ఫేక్ స్కామ్ కావచ్చు! జాగ్రత్త!

Deepfake Voice Cloning : 'డీప్​ ఫేక్'​ మోసం.. స్నేహితుడిలా మాట్లాడి రూ.30వేలకు టోకరా

Last Updated : Nov 17, 2023, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.