ETV Bharat / bharat

'70 ఏళ్ల కాంగ్రెస్​ కష్టాన్ని వృథా చేశారు' - యూపీలో కొవిడ్ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలో కేంద్రం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ట్విట్టర్​ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

priyanka gandhi, priyanka tweet
ప్రియాంక గాంధీ
author img

By

Published : Apr 17, 2021, 6:05 PM IST

కరోనా నియంత్రణలో మోదీ సర్కారు విఫలమైందని మండిపడ్డారు కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంక గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ.. అత్యవసర సమయంలో ఎజెక్ట్ బటన్​ నొక్కే పైలట్ లాంటివారని విమర్శిస్తూ ట్వీట్​ చేశారు.

"దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. టీకాలు ఎగుమతి చేసే సామర్థ్యం గలవారి నుంచి.. టీకాలు దిగుమతి చేసుకునే స్థాయికి వచ్చాం. మోదీ.. అత్యవర పరిస్థితుల్లో ఎగ్జిట్ బటన్​ నొక్కే పైలట్​ లాంటివారు. 70 ఏళ్ల కాంగ్రెస్ కృషిని వృథా చేశారు."

--ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు.

ఉత్తర్​ప్రదేశ్​లో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉందని, 10 రోజుల్లో వైరస్​ వ్యాప్తి ఏడింతలు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రియాంక. టెస్టులు తక్కువగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. లఖ్​నవూ, నోయిడా, గాజియాబాద్, బనారస్, అలహాబాద్​లో కూడా టెస్టుల నిర్వహణ ఆలస్యమవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే ముందుగా ఆర్​టీ- పీసీఆర్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలని సూచించారు.

ఇదీ చదవండి:గుల్మార్గ్​లో హిమపాతం- పర్యటకులు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.