ETV Bharat / bharat

'ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ ప్రభుత్వం విఫలం'

author img

By

Published : Sep 3, 2021, 4:06 AM IST

కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi alleged modi ). మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దివాలా తీయిస్తోందని(rahul gandhi on gdp), దేశ సంపదను మోదీ సన్నిహితుల చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

Congress leader Rahul Gandhi
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీయిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(rahul gandhi on gdp) విమర్శించారు. గడిచిన 70 ఏళ్లుగా సంపాదించుకున్న జాతి సంపదను మోదీకి సన్నిహితులైన కొంతమంది చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు.

ఉత్తర కేరళలో జిల్లా కాంగ్రెస్​ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవంలో వర్చువల్​గా పాల్గొన్నారు రాహుల్​ గాంధీ. కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రైవేటీకరణకు(privatisation in india) కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదన్న రాహుల్‌.. దేశానికి వెన్నెముక లాంటి రైల్వే, ఇతర ప్రధాన సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. దేశంలో జీడీపీ పెరుగుదల అంటే గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెరుగుదల అనే విధంగా మోదీ ప్రభుత్వం కొత్త అర్థాన్ని తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు.

గడిచిన ఏడేళ్లలో జీఎస్​టీ రూపంలో కేంద్రం దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించిందన్న రాహుల్‌.. ఆ సంపదనంతా ఎక్కడికి తరలించారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం అవలంబించే ఆర్థిక విధానాల వల్ల సామాన్యుల ఆదాయం రోజురోజుకు తగ్గుతుంటే.. ప్రధాని సన్నిహితులైన కొంతమంది సంపద మాత్రం పెరుగుతుందని విమర్శించారు.

చెరుకు ధర పెంచాలి: ప్రియాంక

పెట్రోల్​, డీజిల్​, వంట గ్యాస్​ ధరల పెరుగుదల మీద కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మూడేళ్లుగా చెరుకు మద్దతు ధరల పెంపు చేపట్టకపోవటాన్నీ తప్పుపట్టారు. చెరుకు ధరలు పెంచి రైతులకు మద్దతుగా నిలవాలని డిమాండ్​ చేశారు.

అయితే.. తాను కేంద్రం, యూపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారా అనే విషయాన్ని వెల్లడించలేదు. కేంద్రం ఇటీవలే చెరుకు ధరను క్వింటాలుకు రూ.290 చేసింది.

ఇదీ చూడండి: ఇంధన ధరలపై మోదీ సర్కారుకు రాహుల్ చురకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.