Modi Biden Bilateral Talks : జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన బైడెన్.. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. బైడెన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
-
#WATCH | G-20 in India: Prime Minister Narendra Modi and US President Joe Biden hold a bilateral meeting on the sidelines of the G-20 Summit, in Delhi pic.twitter.com/O83JkS3DOQ
— ANI (@ANI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | G-20 in India: Prime Minister Narendra Modi and US President Joe Biden hold a bilateral meeting on the sidelines of the G-20 Summit, in Delhi pic.twitter.com/O83JkS3DOQ
— ANI (@ANI) September 8, 2023#WATCH | G-20 in India: Prime Minister Narendra Modi and US President Joe Biden hold a bilateral meeting on the sidelines of the G-20 Summit, in Delhi pic.twitter.com/O83JkS3DOQ
— ANI (@ANI) September 8, 2023
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీకి సంబంధించిన చిత్రాలను ప్రధాని మోదీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. "లోక్‌కల్యాణ్ మార్గ్-7కు బైడెన్‌ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సమావేశం చాలా ఫలప్రదంగా జరిగింది. భారత్- అమెరికా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచే అనేక అంశాలపై మేమ చర్చించాం. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేసేందుకు ఉపయోగపడుతుంది" అంటూ ట్వీట్ చేశారు.
-
Happy to have welcomed @POTUS @JoeBiden to 7, Lok Kalyan Marg. Our meeting was very productive. We were able to discuss numerous topics which will further economic and people-to-people linkages between India and USA. The friendship between our nations will continue to play a… pic.twitter.com/Yg1tz9kGwQ
— Narendra Modi (@narendramodi) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy to have welcomed @POTUS @JoeBiden to 7, Lok Kalyan Marg. Our meeting was very productive. We were able to discuss numerous topics which will further economic and people-to-people linkages between India and USA. The friendship between our nations will continue to play a… pic.twitter.com/Yg1tz9kGwQ
— Narendra Modi (@narendramodi) September 8, 2023Happy to have welcomed @POTUS @JoeBiden to 7, Lok Kalyan Marg. Our meeting was very productive. We were able to discuss numerous topics which will further economic and people-to-people linkages between India and USA. The friendship between our nations will continue to play a… pic.twitter.com/Yg1tz9kGwQ
— Narendra Modi (@narendramodi) September 8, 2023
శ్వేతసౌధం సంయుక్త స్టేట్మెంట్ విడుదల..
మరోవైపు, మోదీతో బైడెన్ జరిపిన ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి శ్వేత సౌధం.. సంయుక్త స్టేట్మెంట్ను విడుదల చేసింది. "భారత్- అమెరికా మధ్య సన్నిహిత, శాశ్వతమైన భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటిస్తూ.. భారతదేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను మోదీ స్వాగతించారు. ఈ ఏడాది జూన్‌లో మోదీ వైట్‌హౌస్ పర్యటనలో తీసుకున్న నిర్ణయాల అమలులో గణనీయమైన పురోగతిని ఇరు దేశాధినేతలు ప్రశంసించుకున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుతున్న భారత్‌కు బైడెన్ తన మద్దతును పునరుద్ఘాటించారు. 2028-29కి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వాన్ని బైడెన్ స్వాగతించారు. బహుపాక్షిక వ్యవస్థను సంస్కరించాలని అవసరాన్ని ఇరు దేశాధినేతలు నొక్కి చెప్పారు" అని వైట్‌హౌస్ జాయింట్ స్టేట్మెంట్లో పేర్కొంది.
-
Prime Minister Narendra Modi welcomed United States President Biden to India today, reaffirming the close and enduring partnership between India and the United States. The leaders expressed their appreciation for the substantial progress underway to implement the ground breaking… pic.twitter.com/Ym81wCBPqK
— ANI (@ANI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Prime Minister Narendra Modi welcomed United States President Biden to India today, reaffirming the close and enduring partnership between India and the United States. The leaders expressed their appreciation for the substantial progress underway to implement the ground breaking… pic.twitter.com/Ym81wCBPqK
— ANI (@ANI) September 8, 2023Prime Minister Narendra Modi welcomed United States President Biden to India today, reaffirming the close and enduring partnership between India and the United States. The leaders expressed their appreciation for the substantial progress underway to implement the ground breaking… pic.twitter.com/Ym81wCBPqK
— ANI (@ANI) September 8, 2023
ఇస్రో శాస్త్రవేత్తలకు బైడెన్ అభినందనలు..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైనందుకు మోదీతోపాటు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను బైడెన్ అభినందించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దాంతోపాటు భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ ఆదిత్య- ఎల్1ను.. విజయవంతంగా ప్రయోగించినందుకు కూడా బైడెన్ అభినందనలు తెలిపినట్లు పేర్కొంది.
-
President Biden congratulated Prime Minister Modi and the scientists and engineers of the Indian Space Research Organisation (ISRO) on Chandrayaan-3’s historic landing at the south polar region of the Moon, as well as the successful launch of India’s first solar mission,… pic.twitter.com/ZvcrUOWGQK
— ANI (@ANI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">President Biden congratulated Prime Minister Modi and the scientists and engineers of the Indian Space Research Organisation (ISRO) on Chandrayaan-3’s historic landing at the south polar region of the Moon, as well as the successful launch of India’s first solar mission,… pic.twitter.com/ZvcrUOWGQK
— ANI (@ANI) September 8, 2023President Biden congratulated Prime Minister Modi and the scientists and engineers of the Indian Space Research Organisation (ISRO) on Chandrayaan-3’s historic landing at the south polar region of the Moon, as well as the successful launch of India’s first solar mission,… pic.twitter.com/ZvcrUOWGQK
— ANI (@ANI) September 8, 2023
ఇరు దేశాల మధ్య ఒప్పందాలు..
White House Joint Statement India : అమెరికా, భారత్ మధ్య పలు అంశాలపై ఒప్పందాలు కుదిరినట్లు శ్వేత సౌధం తన జాయింట్ స్టేట్మెంట్లో తెలిపింది. అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, భారత బయోటెక్నాలజీ విభాగం మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. బయోటెక్నాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఆవిష్కరణల్లో సహకారంతోపాటు శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో కలిసి పనిచేసేందుకు ఇరు దేశాధినేతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ, రవాణా వ్యవస్థ, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పింది.
మారిషస్ ప్రధానితో మోదీ భేటీ
Mauritius PM G20 India Visit : అంతకుముందు.. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చలు జరిపారు. మారిషస్ ప్రధానితో చాలా మంది సమావేశం జరిగిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్-మారిషస్ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయినందున.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఇది ప్రత్యేక సంవత్సరమని ప్రధాని అన్నారు. మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్, సంస్కృతి సహా కీలక రంగాల్లో సహకారంపై చర్చలు జరిపినట్లు మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దక్షిణ దేశాల గొంతుకను మరింత బలంగా వినిపించాలని.. ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు ప్రధాని తెలిపారు.
-
#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi and Mauritius PM Pravind Kumar Jugnauth hold a bilateral meeting, in Delhi pic.twitter.com/P59ttdu9mK
— ANI (@ANI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi and Mauritius PM Pravind Kumar Jugnauth hold a bilateral meeting, in Delhi pic.twitter.com/P59ttdu9mK
— ANI (@ANI) September 8, 2023#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi and Mauritius PM Pravind Kumar Jugnauth hold a bilateral meeting, in Delhi pic.twitter.com/P59ttdu9mK
— ANI (@ANI) September 8, 2023
-
PM @narendramodi met PM @KumarJugnauth of Mauritius, a key partner integral to India’s vision SAGAR. Both leaders enthusiastically acknowledged the significant enhancement of the India-Mauritius bilateral relationship, commemorating its remarkable 75th anniversary this year. pic.twitter.com/y0vCNQ9Fk1
— PMO India (@PMOIndia) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM @narendramodi met PM @KumarJugnauth of Mauritius, a key partner integral to India’s vision SAGAR. Both leaders enthusiastically acknowledged the significant enhancement of the India-Mauritius bilateral relationship, commemorating its remarkable 75th anniversary this year. pic.twitter.com/y0vCNQ9Fk1
— PMO India (@PMOIndia) September 8, 2023PM @narendramodi met PM @KumarJugnauth of Mauritius, a key partner integral to India’s vision SAGAR. Both leaders enthusiastically acknowledged the significant enhancement of the India-Mauritius bilateral relationship, commemorating its remarkable 75th anniversary this year. pic.twitter.com/y0vCNQ9Fk1
— PMO India (@PMOIndia) September 8, 2023
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ
Bangladesh PM India Visit : అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హసీనాకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. గడిచిన తొమ్మిదేళ్లలో భారత్-బంగ్లా మధ్య సంబంధాలు ఎంతో పురోగతి సాధించాయని ఇది చాలా హర్షణీయమని మోదీ ట్వీట్ చేశారు. బంగ్లా ప్రధానితో కనెక్టివిటీ, వాణిజ్య అనుసంధానం సహా కీలక రంగాలపై చర్చలు జరిపినట్లు మోదీ తెలిపారు.
-
VIDEO | PM Modi holds a bilateral meeting with Bangladesh counterpart Sheikh Hasina in Delhi.#G20India2023 #G20SummitDelhi #G20Summit2023 pic.twitter.com/PKFh5CpsIs
— Press Trust of India (@PTI_News) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | PM Modi holds a bilateral meeting with Bangladesh counterpart Sheikh Hasina in Delhi.#G20India2023 #G20SummitDelhi #G20Summit2023 pic.twitter.com/PKFh5CpsIs
— Press Trust of India (@PTI_News) September 8, 2023VIDEO | PM Modi holds a bilateral meeting with Bangladesh counterpart Sheikh Hasina in Delhi.#G20India2023 #G20SummitDelhi #G20Summit2023 pic.twitter.com/PKFh5CpsIs
— Press Trust of India (@PTI_News) September 8, 2023
-
PM @narendramodi had productive talks with PM Sheikh Hasina on diversifying the India-Bangladesh bilateral cooperation. They agreed to strengthen ties in host of sectors including connectivity, culture as well as people-to-people ties. pic.twitter.com/l7YqQYMIuJ
— PMO India (@PMOIndia) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM @narendramodi had productive talks with PM Sheikh Hasina on diversifying the India-Bangladesh bilateral cooperation. They agreed to strengthen ties in host of sectors including connectivity, culture as well as people-to-people ties. pic.twitter.com/l7YqQYMIuJ
— PMO India (@PMOIndia) September 8, 2023PM @narendramodi had productive talks with PM Sheikh Hasina on diversifying the India-Bangladesh bilateral cooperation. They agreed to strengthen ties in host of sectors including connectivity, culture as well as people-to-people ties. pic.twitter.com/l7YqQYMIuJ
— PMO India (@PMOIndia) September 8, 2023
శనివారం, ఆదివారం మోదీ షెడ్యూల్ ఇలా..
G20 Summit 2023 : శనివారం జీ20 సదస్సు మధ్యలో యూకే ప్రధాని రిషి సునాక్‌తో పాటు జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో ప్రధాని మోదీ లంచ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత కెనడా ప్రధానితో కొంతసేపు ముచ్చటించనున్నారు. తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, కొమొరోస్, యూరోపియన్ కమిషన్, బ్రెజిల్, నైజీరియా దేశాల నేతలతోనూ ప్రధాని ద్వైపాక్షికంగా భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
G20 Dinner Invite : జీ 20 అతిథులకు రాష్ట్రపతి విందు.. ఖర్గేకు అందని అహ్వానం.. దేవెగౌడ దూరం
భారత సత్తా చాటేలా జీ20.. ఆ విషయంలో విజయం.. ఉమ్మడి ప్రకటన సంగతేంటి?