బిహార్‌లోని దర్భంగలో దారుణ ఘటన జరిగింది. దొంగతనానికి పాల్పడ్డాడని ఓ దళితుడిపై మూకదాడికి దిగారు దుండగులు. ఈ దాడిలో బాధితుడు ఎముకలు విరగొట్టారు. దాహం వేస్తుందంటూ బాధితుడు నీరు అడడగా.. బలవంతంగా అతడితో మూత్రాన్ని తాగించారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. దళితుడిపై దాడి విషయం తెలుసుకున్న దర్భంగ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.
పోలీసులు వివరాల ప్రకారం.. దర్భంగలోని కియోటి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజోరా గ్రామానికి చెందిన రామ్ ప్రకాశ్ పాశ్వాన్ అనే దళితుడు దొంగతనానానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతడిపై దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండగులు కర్రలతో కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారడం వల్ల ఈ దారుణం బయటపడింది. కొంతమంది దుండగులు బాధితుడు రామ్ ప్రకాశ్ పాశ్వాన్.. చేతులు, కాళ్లను తాడుతో కట్టి కర్రలతో అతడిపై దాడి చేశారు.
"ఆగస్టు 16 రాత్రి మధుబనీలోని మా అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచి నా తండ్రి వస్తున్నాడు. అతను రహికా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిజ్రా గ్రామానికి చేరుకున్నప్పుడు ఎవరో ఆగమని పిలిచారు. ఆ తర్వాత కొందరు వచ్చి దాడికి పాల్పడ్డారు. కర్రలతో చేతులు, కాళ్ల మీద కొట్టారు. ప్రస్తుతం నాన్న పరిస్థితి విషమంగా ఉంది."
- పూజా కుమారి, బాధితుడి కుమార్తె
ఇవీ చదవండి: న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం అదే కావాలన్న జస్టిస్ రమణ
మన ప్లాన్ ఇది కాదు కదా, ఆజాద్ రాజీనామాపై జీ23 నేతల రియాక్షన్