ETV Bharat / bharat

బైక్​పై కొత్త MLA లాంగ్ రైడ్- 350కి.మీ బండి నడిపి అసెంబ్లీకి వచ్చిన కమలేశ్వర్ - kamaleshwar dodiyar bike ride

MLA To Assembly By Bike 350 Km : ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్​లోని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఓ ఎమ్మెల్యే బైక్​పై అసెంబ్లీకి వెళ్లారు. 350కి.మీ బైక్​పై ప్రయాణించి అసెంబ్లీలో తన విజయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. మరి ఆ ఎమ్మెల్యే ఏ పార్టీ తరఫున గెలిచారో? ఎందుకు ఇలా వినూత్నంగా బైక్​పై వెళ్లారో? తెలుసుకుందాం పదండి.

mla to assembly by bike 350 km
mla to assembly by bike 350 km
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 5:40 PM IST

బైక్​పై కొత్త MLA లాంగ్ రైడ్- 350కి.మీ బండి నడిపి అసెంబ్లీకి వచ్చిన కమలేశ్వర్

MLA To Assembly By Bike 350 Km : మధ్యప్రదేశ్​లో ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికైన కమలేశ్వర్​ డొడియార్ తన స్వస్థలం నుంచి భోపాల్​లోని శాసనసభకు బైక్​పై వచ్చారు. రత్లాం జిల్లా సైలానా నుంచి ఆయన ఈ ప్రయాణం చేశారు. ఇలా ఎందుకు చేశారని.. భోపాల్​లోని అసెంబ్లీ దగ్గర ప్రశ్నించిన రిపోర్టర్లకు అసలు విషయం చెప్పారు కమలేశ్వర్.

"నాకు కారు కొనే స్తోమత లేదు. అందుకే చాలా కాలంగా బైక్​పైనే ప్రయాణిస్తున్నా.
ప్రశ్న: ఎమ్మెల్యే హోదాలో కారు ఉపయోగిస్తారా లేదా?
జవాబు: భద్రతాపరంగా తప్పదని అనుకుంటేనే కారు ఉపయోగిస్తా. అలాంటి ఇబ్బంది లేకపోతే బైక్​పైనే ప్రయాణిస్తా."
--కమలేశ్వర్ డొడియార్, ఎమ్మెల్యే

లా చదివిన కమలేశ్వర్​.. భారతీయ ఆదివాసీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్​ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం ఇదే తొలిసారి. అసెంబ్లీలో తన విజయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు సైలానా నుంచి 350కిలోమీటర్లు బైక్​పై వచ్చారు కమలేశ్వర్.

mla to assembly by bike 350 km
బైక్​పై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే కమలేశ్వర్ డొడియార్

"బుధవారం మధ్యాహ్నం సైలానాలో బయలుదేరా. రాత్రి 9.45కు భోపాల్ చేరుకున్నా. చీకటిగా ఉందని నెమ్మదిగా వచ్చా. అయితే.. సాయంత్రం 4గంటల వరకే అసెంబ్లీ కార్యాలయం పని చేస్తుందట. నేను రావడం ఆలస్యమైంది. మా ప్రాంతం పరిస్థితులు, సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడతా. నా డిమాండ్లు పరిష్కరిస్తారని నమ్ముతున్నా."
--కమలేశ్వర్ డొడియార్, ఎమ్మెల్యే

సైలానా నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్​ నేత హర్ష్​ విజయ్​ గహ్లోత్​పై 4,618 ఓట్ల తేడాతో గెలిచారు కమలేశ్వర్.

డిసెంబరు 3న విడుదలైన మధ్యప్రదేశ్​లో ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ విజయఢంకా మోగించింది. ఎగ్జిట్ పోల్స్​ ఫలితాలను తారుమారు చేస్తూ శివరాజ్​ సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్​ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్​తో హోరాహోరీ పోరు నెలకొంటుందనుకున్నా ఆయన మాస్టర్​ ప్లాన్​ను పక్కాగా అమలు చేసి భారతీయ జనతా పార్టీ బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొత్తం 230 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లలో విజయం సాధించింది. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ 66 స్థానాల్లో గెలుపొందింది. భారతీయ ఆదివాసీ పార్టీ ఒక సీటు దక్కించుకుంది. భారతీయ ఆదివాసీ పార్టీ తరఫున కమలేశ్వర్ డొడియార్​ విజయం సాధించారు. ఆయన అసెంబ్లీలో తన విజయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు సైలానా నుంచి 350కిలోమీటర్లు బైక్​పై వెళ్లారు.

అయోధ్య రాముడికి కొత్త అర్చకుల పూజలు!- 6నెలలపాటు ట్రైనింగ్​- 30ఏళ్ల లోపు వారికే ఛాన్స్​

ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్- 500ఏళ్ల వరకు నో డ్యామేజ్- ధర కూడా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.