ETV Bharat / bharat

'వందకు 10 మార్కులే వచ్చినా 'థర్డ్​ ర్యాంక్' ప్రచారం'.. భాజపాపై స్టాలిన్​ సెటైర్​

MK Stalin BJP: కేవలం 10 మార్కుల సాధించి 'మూడో ర్యాంకు' ప్రచారం చేసుకుంటోందంటూ.. భాజపాపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​. తమిళనాడులో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించామన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాజపాపై విమర్శలు గుప్పించారు.

MK Stalin BJP
ఎంకే స్టాలిన్​
author img

By

Published : Apr 3, 2022, 4:33 PM IST

MK Stalin on BJP: తమిళనాడులో మూడో శక్తిమంతమైన పార్టీగా ఎదిగామని భాజపా చెప్పుకోవటంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​. భాజపా వ్యాఖ్యలు మొదటి విద్యార్థి 90 మార్కులు, రెండో విద్యార్థి 50 మార్కులు రాగా.. మూడో విద్యార్థి 10 మార్కులు సాధించి.. థర్డ్​ ర్యాంకుగా చెప్పుకుంటున్నట్లు ఉందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నామని భాజపా నేతలు భావించటం తప్పు అని అభిప్రాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో సీట్ల సంఖ్య తగ్గిందని, ఉప ముఖ్యమంత్రి సహా 10 మంది మంత్రులు ఓడిపోయినట్లు గుర్తు చేశారు. గోవాలో పలువురు కీలక నేతలు, ఉత్తరాఖండ్​లో ఏకంగా ముఖ్యమంత్రే ఓటమిపాలయ్యారని తెలిపారు. మూడు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాజపాపై విమర్శలు గుప్పించారు స్టాలిన్​.

"ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. అది భాజపాకు ప్రతికూలమనే చెబుతాను. ఉత్తర్​ప్రదేశ్​లో గతంలో కంటే తక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఉప ముఖ్యమంత్రి సహా 10 మంది మంత్రులు ఓడిపోవటం ప్రజల్లో వ్యతిరేకతను సూచిస్తుంది. ఉత్తరాఖండ్​లో భాజపా ముఖ్యమంత్రి, గోవాలో కీలక నేతలు ఓడిపోయారు. పంజాబ్​లో కేవలం రెండు సీట్లు మాత్రమే సాధించారు."

- ఎంకే స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి.

ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే తర్వాత మూడో అతిపెద్ద శక్తిగా ఎదిగామని భాజపా పేర్కొంది. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు స్టాలిన్​. 'పరీక్షల్లో ఓ బాలుడు 90 మార్కులు, మరో విద్యార్థి 50, మరో విద్యార్థి 10 మార్కులు సాధించాడు. 10 మార్కులు సాధించిన విద్యార్థి మూడో ర్యాంకు సాధించాడని మీరు ప్రశంసిస్తారా?' అని ప్రశ్నించారు. అలాగే.. ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా అఖండ విజయం సాధించటం 2024 ఎన్నికల్లో కీలకంగా మారనుందన్న రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని తప్పుపట్టారు స్టాలిన్​.

" ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలను ఒకే విధంగా చూడకూడదు. ఒకేలా ఉంటాయని నేను అనుకోను. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆధారపడతాయి. పార్లమెంటరీ ఎన్నికలు తదుపరి ప్రధానమంత్రి ఎవరనేదానిపై దృష్టిసారిస్తాయి. రెండింటినీ ఒకే విధంగా చూసి అంచనాకు రావటం సరైంది కాదు. మరోవైపు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ విజయం సాధించినట్లు చెప్పటం తప్పవుతుంది. వ్యక్తిగతంగా భాజపాను వ్యతిరేకించటం లేదు. భాజపా విధానాలను విమర్శిస్తాం కానీ, వ్యక్తులను కాదు. మా విమర్శలన్నీ సూత్రప్రాయంగా ఉంటాయి. దేశానికి ఎవరు ప్రధాని, రాష్ట్రపతి అవుతారనే అంశంలో డీఎంకే ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. పార్లమెంటులో మూడో అతిపెద్ద పార్టీగా డీఎంకే అవతరించింది. జాతీయ రాజకీయాల్లో మేము ఎప్పుడూ కీలకమే.. భవిష్యత్తులోనూ మా పాత్ర ఉంటుంది."

- ఎంకే స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి.

2024లో భాజపాను ఎదుర్కోవటానికి విపక్ష పార్టీలకు అందించే సందేశమేంటని అడగగా..' ఐకమత్యమే మహాబలం అని అన్ని పార్టీలు గుర్తించాలి. దేశాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రావాలి. భారత వైవిధ్యం, సమాఖ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, సౌభ్రాతృత్వం, రాష్ట్రాల హక్కులు, విద్యా హక్కులను కాపాడాలనుకుంటే వ్యక్తిగత రాజకీయ ఆలోచనలను పక్కనబెట్టి ఒక్కటి కావాలని కోరుతున్నా.' అని పేర్కొన్నారు స్టాలిన్​.

స్థానిక ఎన్నికల్లో భాజపా: 2019 లోక్​సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకేను రెండో స్థానానికి పరిమితం చేసింది డీఎంకే. 12,800 సీట్లలో దాదాపు మూడింట రెండొంతుల స్థానాలను సాధించింది. రెండో స్థానంలో అన్నాడీఎంకే నిలవగా.. భాజపా 300 సీట్లకుపైగా గెలుచుకుంది. అయితే.. మొత్తం 5,600 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టటం గమనార్హం. ఈ ఫలితాలను సూచిస్తూ ద్రవిడ ప్రాంతంలో కమలం వికసిస్తోందని పేర్కొన్నారు భాజపా నేతల. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించామన్నారు.

ఇదీ చూడండి: 'ధరల పెంపుతో కేంద్రం దాడి.. ప్రజలపై రూ.1.25 లక్షల కోట్ల భారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.