ETV Bharat / bharat

వేల లీటర్ల నీటిని మింగేస్తున్న 'మాయా బావి' - మాయా బావి

Miracle well in Tirunelveli: తమిళనాడులోని మాయా బావి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంత నీటిని అయినా మింగేస్తోంది. ఎంత నీరు ఆ బావిలో పడుతున్నా.. కొంచెం కూడా నీరు పైకి రావడం లేదు. ఇటీవల కురిసిన వర్షం ధాటికి ఆ ఊరంతా నీరు చేరగా.. ఆ నీటిని ఈ బావిలోకి మళ్లించారు. అయినా బావిలో నీటి మట్టం కొంచెం కూడా పెరగలేదు.

Miracle well in Tirunelveli
గ్యాలన్ల కొద్ది నీటిని మింగేస్తున్న 'మాయా బావి'
author img

By

Published : Nov 30, 2021, 7:42 PM IST

మాయా బావి

miracle well: తమిళనాడులోని మాయా బావి వేల లీటర్ల నీటిని అమాంతం మింగేస్తోంది. తిరునెల్వేలి జిల్లాలోని తిసయ్యన్‌వేలి పట్టణానికి సమీపంలోని అయంకుళం పడుగై వద్ద ఈ బావి ఉంది. ఈ బావిలోకి ఎంత నీరు పంపినా.. నీటి మట్టం కొంచెం కూడా పెరగడం లేదు.

ఇటీవల భారీ వర్షాలకు ఆయంకుళం పడుగైలో భారీగా వరద చేరింది. ఈ వరద నీటిని చిన్న కాలువ తవ్వి బావిలోకి మళ్లించారు. వరద మొత్తం బావిలోకి పంపినా.. నీటి మట్టం కొంచెం కూడా పెరగలేదు.

ఈ అద్భుత బావిని చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ బావి ప్రైవేట్‌ స్థలంలో ఉందని అధికారులు తెలిపారు. ఆయంకుళం పడుగైలోని స్థానికులు ఈ అద్భుత బావికి క్రమ వ్యవధిలో సుమారు 50 క్యూబిక్ అడుగుల నీటిని మళ్లించారు. ఎంత నీటిని మళ్లించినా ఈ బావి పొంగిపొర్లలేదని తెలిపారు.

ఇదీ చూడండి:- అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు.. సీఎం ఛాంబర్​కు దగ్గర్లోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.