కేరళకు చెందిన ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు దుండగులు. గతంలో రెండుసార్లు ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న బాలిక.. ఇన్ని రోజులు ఓ సంరక్షణ కేంద్రంలో గడిపింది. అక్కడి నుంచి బయటకు రాగానే మళ్లీ వేధింపులు ఎదురయ్యాయి.
2016, 2017 సంవత్సరాల్లో లైంగిక వేధింపులు ఎదురైన నేపథ్యంలో పండిక్కడ్‌కు చెందిన 17 ఏళ్ల బాలికను.. నిర్భయ చైల్డ్‌కేర్ హోమ్‌కు తరలించారు అధికారులు. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి బయటకు రాగానే ఆమెపై మళ్లీ లైంగిక దాడి జరిగింది.
ఈ నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంరక్షణ కేంద్రాల నుంచి బయటకు వచ్చిన బాధితుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: 13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం