ETV Bharat / bharat

'ఐదేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం!' - గాజియాబాద్​లో చిన్నారిపై అత్యాచారం

ఐదేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ట్యూషన్ కోసం చిన్నారి తమ ఇంటికి రాగా.. అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

minor girl raped in up ghaziabad
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
author img

By

Published : Oct 28, 2021, 5:27 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో(Uttar Pradesh Ghaziabad) దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలుడ్ని పోలీసులు పిల్లల సంరక్షణ గృహానికి తరలించారు.

అసలేం జరిగింది..?

గాజియాబాద్​లోని(Uttar Pradesh Ghaziabad) విజయ నగర్​ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి(5).. తన సోదరుడితో కలిసి ట్యూషన్​ కోసం ఓ ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లింది. అయితే.. అక్కడ ఆ టీచర్​ లేడు. ఆ తర్వాత ఏదో పని కోసం బాలికను అక్కడే ఉంచి.. ఆమె సోదరుడు తమ ఇంటికి వెళ్లాడు.

ఆ సమయంలో ట్యూషన్ టీచర్​ కుమారుడు(13).. సదరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి.. ఏడుస్తూ ఇంటికి వచ్చి తన తల్లికి విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చిన్నారి తండ్రి రిక్షా నడపుతూ కుటుంబాన్ని పోషిస్తాడని పోలీసులు తెలిపారు. వారు ఆ ఉపాధ్యాయుడికి చెందిన ఇంట్లోనే అద్దెకు ఉంటారని చెప్పారు. ఈ వ్యవహారంపై చర్చించుకుని, రాజీ చేసుకుందామని నిందితుడి తండ్రి ఒత్తిడి తెచ్చాడని చిన్నారి తండ్రి ఆరోపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలుడ్ని సంరక్షణ గృహానికి తరలించారు.

ఇదీ చూడండి: తుపాకీతో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారం

ఇదీ చూడండి: 21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.