ETV Bharat / bharat

నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్​.. ఇంటి వెనుకకు తీసుకెళ్లి రేప్ - మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో రేప్

తన కుటుంబంతో కలిసి ఇంటిలో నిద్రిస్తున్న మైనర్​ను కిడ్నాప్ చేశాడు ఓ యువకుడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

minor rape
మైనర్​పై అత్యాచారం
author img

By

Published : Nov 13, 2022, 3:14 PM IST

మధ్యప్రదేశ్ ఇందోర్​లో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికను కిడ్నాప్​ చేసి.. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి తండ్రి.. రాజేంద్ర నగర్​లో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బాధితురాలు తన కుటుంబంతో కలిసి చిన్న గుడిసెలో నిద్రిస్తుండగా.. నిందితుడు(32) ఆమెను కిడ్నాప్ చేశాడు. బాలికను నిర్మాణ స్థలం బయటకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక అరుపులు విన్న ఆమె తల్లిదండ్రులు వచ్చి నిందితుడి చెర నుంచి ఆమెను రక్షించారు. ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడు.. ఇందోర్​లోని అహిర్​ఖేడీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎదుట నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీ చదవండి: తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం

పాత పెట్రోల్ వాహనాలను.. కొత్త ఎలక్ట్రిక్​ బైక్​గా.. ఓ వృద్ధురాలి వినూత్న ఆలోచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.