ETV Bharat / bharat

దళిత బాలికపై అత్యాచారం.. గొంతుకోసి, నగ్నంగా మార్చి.. - Jawan Girl rape case

UP dalit Gang rape: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం చోటుచేసుకుంది. 13ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు. పోలీసులకూ సమాచారం ఇవ్వలేదు. మరోవైపు, రాజస్థాన్​లో రెండు దారుణ అత్యాచారాలు జరిగాయి. అత్యాచారానికి యత్నించిన ఓ జవానుకు అరుణాచల్​ప్రదేశ్​లోని ఓ కోర్టు పదేళ్ల కఠిన శిక్ష విధించింది.

minor-girl-gangrape-in-up
minor-girl-gangrape-in-up
author img

By

Published : Jun 5, 2022, 8:16 AM IST

UP gang rape news: ఉత్తర్​ప్రదేశ్​లో 13ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బుధవారం జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినా.. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించలేదు. చిత్రకూట్ జిల్లాలోని పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక నివసిస్తోందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి బయట నిద్రిస్తుండగా.. ఆమెపై అత్యాచారం జరిగిందని చెప్పారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు శనివారం స్పష్టం చేశారు. వీరిని నదీమ్, ఆదర్శ్ పాండే, విపుల్ మిశ్రగా గుర్తించారు.

అయితే, ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాలిక మరణించినా.. ఎవరికీ చెప్పలేదు. ముందుగా, చికిత్స కోసం ఆమెను కౌశంబి జిల్లాకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి బాలిక అక్కడే మరణించింది. గుట్టుచప్పుడు కాకుండా శుక్రవారం బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇలా ఎందుకు చేశారనే విషయంపై కుటుంబ సభ్యులను ప్రశ్నించనున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వేచిచూస్తున్నట్లు చెప్పారు.

Rajasthan Girl murder: రాజస్థాన్​లో తొమ్మిదేళ్ల బాలికను గొంతుకోసి చంపారు దుండగులు. ఆమేర్ ప్రాంతంలో శనివారం జరిగిందీ ఘటన. శనివారం మధ్యాహ్నం నుంచి బాలిక ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. ఆదివారం దడాబాదీ ప్రాంతంలో శవమై తేలింది. ఎవరూ లేని ప్రాంతంలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. బాలిక మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఫోరెన్సిక్ నిపుణులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

minor-girl-murder
ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు

Gang rape in Rajasthan: ఇదే రాష్ట్రంలోని భరత్​పుర్​లో టీనేజర్​పై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ మైనర్​పై నెలలో ఆరుసార్లు అత్యాచారం చేశారు. నిందితులకు ఇద్దరు మహిళలు సహకరించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

మే 4న తొలిసారి బాలికపై అత్యాచారం జరిగింది. ముందురోజు మోను, తార్నవ్, సంతోష్ అనే ముగ్గురు బాలికను స్థానిక హనుమాన్ మందిరానికి తీసుకెళ్లారు. ఈ పరిచయంతో తర్వాతి రోజు మళ్లీ కలిశారు. మత్తుపానీయాలు తాగించి బాలికపై అత్యాచారం చేశారు. దీంతో బాలిక స్పృహ కోల్పోయింది. అనంతరం, అసభ్య ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలికకు వీడియోలు చూపించి నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు. వీరికి భయపడి బాలిక విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత మే 7, 17, 27 తేదీల్లో నిందితులు మైనర్​పై అత్యాచారం చేశారు. గర్భం రాకుండా ఉండేందుకు బాలికకు మాత్రలు ఇచ్చారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.

Jawan Girl rape case: బాలికపై అత్యాచారానికి యత్నించిన కేసులో జవానుకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ అరుణాచల్ ప్రదేశ్​లోని తిరాప్ జిల్లా ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. దోషి బరున్ సింగ్ ఎనిమిదేళ్ల క్రితం బాలికను అపహరించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అతడు అసోం రైఫిల్స్​లో పనిచేస్తున్నాడు. మరో జవానుకు సైతం ఈ ఘటనతో సంబంధం ఉంది. చంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వీరిద్దరూ 2014 జనవరి 22న ఓ ఇంట్లోకి చొరబడి బాలికను లాక్కెళ్లారు. అసోం రైఫిల్స్ క్యాంపస్​కు ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, రెండో నిందితుడిని బాధితురాలు గుర్తించలేకపోయింది.

ఈ నేపథ్యంలో కేసు తీర్పు వెలువరించిన పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హెచ్ కశ్యప్.. జవానుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు రక్షణ కల్పించడం జవాన్ల విధి అని.. పారామిలిటరీ దళాల నుంచి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదని అన్నారు. పదేళ్ల శిక్ష విధించిన అనంతరం.. బాధితురాలికి పరిహారంపైనా ఆదేశాలు జారీ చేశారు. అరుణాచల్​ప్రదేశ్ చట్టాల ప్రకారం బాధితురాలికి తగిన పరిహారం ఇవ్వాలని చంగ్లాంగ్ జిల్లా లీగల్ సర్వీసెస్ అధికారులకు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.