ETV Bharat / bharat

'నా వాళ్లే లైంగికంగా వేధిస్తున్నారు'.. 10ఏళ్ల బాలిక ఫిర్యాదు! - బాలికపై లైంగిక దాడి

సొంత కుటుంబ సభ్యులే తనపై లైంగిక వేధింపులకు(sexual exploitation) పాల్పడుతున్నారని ఓ 10 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్​ అశోక్​నగర్​ జిల్లాలో జరిగింది. ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

sexual abuse
10 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు
author img

By

Published : Sep 5, 2021, 4:13 PM IST

మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి, వావివరసలు మరిచి సొంత కుటుంబీకులు, తెలిసినవారే ఎక్కువగా ఈ దుశ్చర్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆలాంటి ఘటనే మధ్యప్రదేశ్​ అశోక్​నగర్​ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్ల బాలికపై ఐదుగురు కుటుంబ సభ్యులు లైంగిక వేధింపులకు(sexual exploitation) పాల్పడ్డారు.

ఏం జరిగింది?

జిల్లాలోని చందేరీ తహసీల్​లో తన తల్లితో కలిసి ఉంటోంది బాలిక. కొద్ది రోజులుగా కుటుంబంలోని ఐదుగురు తనను లైంగికంగా వేధిస్తున్నారని తల్లికి ఇటీవల తెలిపింది. విషయం పూర్తిగా తెలుసుకున్న ఆమె తల్లి.. ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసిందుకు సిద్ధమైంది. అయితే.. నిందితులకు ఆ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉన్న క్రమంలో వారిని ఆపేందుకు యత్నించారు. పోలీసులకు చెప్పొద్దని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు.

కుటుంబ సభ్యుల మాటలను తోసిపుచ్చిన తల్లీకూతుళ్లు.. అశోక్​నగర్​ మహిళా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదుతో పోక్సో సహా పలు సెక్షన్ల కింద.. కేసు నమోదు చేశారు పోలీసులు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: RAPE ATTEMPT: ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి వృద్ధుడి అత్యాచారయత్నం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.