ETV Bharat / bharat

బడ్జెట్​పై భాజపా దేశవ్యాప్త ప్రచారం - బడ్జెట్​పై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా

బడ్జెట్​పై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా సిద్ధమైంది. పద్దుపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు.. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది.

Ministers, BJP's top leadership to reach out to masses, explain welfare measures in Union Budget
బడ్జెట్​పై భాజపా దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాలు
author img

By

Published : Feb 4, 2021, 1:48 PM IST

ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్​లో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర మంత్రులు, భాజపా అగ్రనేతలు దేశవ్యాప్త పర్యటనలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో తమకు కేటాయించిన నగరాల్లో నేతలు పర్యటించనున్నారు. బడ్జెట్​పై వితిపక్షాల వాదనలు తిప్పికొట్టడంపై ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. విమర్శలకు ఏ విధంగా సమాధానం ఇవ్వాలన్న విషయంపై మంత్రులు, వారి ప్రతినిధులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే సూచనలు ఇచ్చారు.

ముంబయిలో జరిగే కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొననుండగా.. నాగ్​పుర్​లో నితిన్ గడ్కరీ, జమ్ములో జితేంద్ర సింగ్ ప్రసంగించనున్నారు.

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ భోపాల్​లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. గువాహటిలో సృతి ఇరానీ, గోవాలో గజేంద్ర షెకావత్, లఖ్​నవూలో పీయూష్ గోయల్, హైదరాబాద్​లో ధర్మేంద్ర ప్రధాన్, బెంగళూరులో ప్రహ్లద్ జోషి బడ్జెట్ అవగాహన సమావేశాల్లో పాల్గొననున్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా

భాజపా ప్రధాన కార్యదర్శులు దిలీప్ సైకియా, సీటీ రవి, భూపేంద్ర యాదవ్, తరుణ్ ఛుగ్​ సైతం వివిధ సభల్లో పాల్గొననున్నారు. వీరితో పాటు భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఫీస్ బేరర్లు కూడా స్థానికంగా అవగాహన కల్పించనున్నారు.

ఇదీ చదవండి: గాజీపూర్​ సరిహద్దులో మేకులు తొలగింపు.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.