ETV Bharat / bharat

గోవాలో 'న్యూ ఇయర్'​ వేడుకలు ఈసారి ఎలాగంటే! - గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​

నూతన సంవత్సర వేడుకలకు పెట్టింది పేరు గోవా. అయితే.. కొత్త రకం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి ఆ సంబరాలకు బ్రేక్​ పడనున్నట్లు తెలుస్తోంది. రాత్రిపూట కర్ఫ్యూ విధించే ఆలోచనలో ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. మరోవైపు.. నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు పెద్దఎత్తున పర్యటకులు తరలివస్తున్నారు.

Minister says night curfew likely in Goa, CM says no decision
గోవాలో 'న్యూ ఇయర్'​ వేడుకలు ఈసారి ఎలాగంటే!
author img

By

Published : Dec 31, 2020, 7:39 PM IST

Updated : Dec 31, 2020, 7:53 PM IST

గోవాలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలనుకునే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు! కొత్త రకం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించే అవకాశముందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్​ రాణే తెలిపారు. అయితే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

goa new year celbrations
నూతన సంవత్సర వేడుకల ముస్తాబయిన గోవా బీచ్​

రాత్రి పూట కర్ఫ్యూ విధించే ఆలోచనపై సీఎంతో చర్చించినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన ఓ ప్రకటనలో మంత్రి రాణే తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కొవిడ్​ నిబంధనలపై కేంద్రం నుంచి వచ్చిన లేఖ అనంతరమే ఈ నిర్ణయంపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకుల కోసం పర్యటకులు భారీ సంఖ్యలో గోవాకు విచ్చేస్తున్నారు. అక్కడి బీచ్​ల్లో ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు.

goa new year celbrations
గోవా బీచ్​లో సందడి చేస్తున్న పర్యటకులు

గోవాలో వైరస్​ నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కేంద్రం కోరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన ఓ సీనియర్​ అధికారి చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​ సూచించారని అన్నారు. అయితే.. రాత్రిపూట కర్ఫ్యూ విధించడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ చెప్పారు.

ఇదీ చూడండి:కొత్త సంవత్సర​ వేడుకలకు కరోనా సెగ- కఠిన ఆంక్షలు

Last Updated : Dec 31, 2020, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.